
రూ.65 వేల నుంచి 1.45 లక్షల వరకు టాటా కార్ల రేట్లు తగ్గుదల
మహీంద్రా వాహన ధరలు గరిష్టంగా రూ.1.56 లక్షల వరకు డౌన్
టయోటా కార్లు గరిష్టంగా 3.34 లక్షల వరకు తగ్గింపు
రూ.96 వేల వరకు తగ్గనున్న రెనో కార్ల రేట్లు
ముంబై: జీఎస్‌టీ క్రమబద్ధీకరణ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించేందుకు ఆటో కంపెనీలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా తమ వాహన ధరలను గణనీయంగా తగ్గిస్తున్నాయి. పండుగ సీజన్ అమ్మకాలు పెంచుకునే లక్ష్యంలో భాగంగా మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రెనో ఇండియా, టయోటా కిర్లోస్కర్ ఇండియా, వాహన ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
ఇప్పటికే టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహన ధరల్ని కనీసం రూ. 75 వేల నుంచి గరిష్టంగా రూ. 1.45 లక్షల వరకు తగ్గిస్తామని తెలిపింది. మరో వైపు సవరించిన జీఎస్‌టీ రేట్లకు అనుగుణంగా కార్ల ధరలను తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్ సీ.భార్గవ చెప్పారు. మెుత్తానికి ఈ పండుగ సీజన్‌లో వాహన విక్రయాలు దుమ్ముదులిపేస్తాయని ఆటో పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మహీంద్రా అండ్ మహీంద్రా: ఎక్స్‌యూవీ3ఎక్స్‌ఓ డీజిల్ మోడల్‌పై రూ.1.56 లక్షల వరకు, స్కా రి్పయో ఎన్ ధర రూ.1.45 లక్షలు వరకూ తగ్గించింది. ఎక్స్‌యూవీ700పై రూ.1.43 లక్ష,లు, ఎక్స్‌యూవీ3ఎక్స్‌ఓ పెట్రోల్ మోడల్‌పై రూ.1.40 లక్షల వరకు, థార్ 2డబ్ల్యూడీ (డీజిల్) వేరియంట్ రూ.1.35 లక్షల వరకు, థార్ 4డబ్ల్యూడీ డీజిల్ కార్లపై రూ.1.01 లక్షల వరకు, స్కార్పియో క్లాసిక్ రూ.1.01 లక్షల వరకు థార్ రోక్స్ పై రూ.1.33 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది.
బొలెరో/నియోపై రూ.1.27 లక్షలు తగ్గించింది. జీఎస్‌టీ కొత్త రేట్లు సెపె్టంబర్ 22, 2025 నుండి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ మహీంద్రా మాత్రం తక్షణమే వినియోగదారులకు లాభం చేకూర్చాలని నిర్ణయించింది. కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా సందేశంలో, ‘‘అందరూ సెపె్టంబర్ 22 కోసం ఎదురుచూస్తున్నారు. కానీ మేము ఇప్పుడే జీఎస్‌టీ ప్రయోజనాలను అందిస్తున్నాం. తక్షణమే (సెప్టెంబర్ 6 నుంచే) తగ్గింపు రేట్లను పొందండి’’ అని పేర్కొన్నారు.
రెనో ఇండియా సైతం: తన మోడళ్లపై తగ్గింపులను జీఎస్టీ క్రమబదీ్ధకరణకు అనుగుణంగా ప్రకటించింది. మోడళ్ల వారీగా తగ్గిన రెనో రేట్లను పరిశీలిస్తే.. ఎంట్రీ లెవల్ క్విడ్ మోడల్ ధర రూ.55,095 తగ్గింది. ట్రైబర్ మోడల్ రూ.80,195 వరకు చౌకగా మారుతుంది. కైగర్ మోడల్ రూ.96,395 వరకు ధర తగ్గింపుతో అందుబాటులోకి వస్తోంది. తగ్గింపు ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది.
తగ్గింపు బాటలో టయోటో కిర్లోస్కర్: టయోటా కిర్లోస్కర్ మోటార్ సైతం జీఎస్‌టీ రేటు తగ్గింపు ప్రయోజనాలను పూర్తి స్థాయిలో కస్టమర్లకు బదిలీ చేస్తామని ప్రకటించింది. తమ కార్ల ధరలను గరిష్టంగా రూ.3.34 లక్షల వరకు తగ్గించనున్నట్లు వెల్లడించింది. సెపె్టంబర్ 22 నుంచి చేసే అన్ని డెలివరీలపై ఈ తగ్గింపు వర్తిస్తుందని సంస్థ వెల్లడించింది.
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ... ఫార్చ్యూ నర్ ధర రూ. 3.49 లక్షల వరకు తగ్గనుంది. వెల్‌ఫైర్ ధర రూ. 2.78 లక్షలు, హైలక్స్ ధర రూ.2.52 లక్షలు, కామ్రీ ధర రూ.1.01 లక్షల తగ్గనున్నాయి.
కామ్రీ ధరలో రూ. 1.01 లక్షలు, లెజెండర్‌లో రూ. 3.34 లక్షలు, అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో రూ. 65,400, గ్లాంజాలో రూ. 85,300 తగ్గింపు ఉంటుంది. ‘‘చారిత్రాత్మక సంస్కరణ చేపట్టిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇది ఆటో సెక్టార్‌లో విశ్వాసా న్ని బలోపేతం చేస్తుంది. ఈ రాయితీలు కస్టమర్లకు కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు ఉపయోగపడతాయని టయోటో కిర్లోస్కర్ మోటార్ వైస్ ప్రెసిడెంట్ వరిందర్ వధ్వా తెలిపారు.
సిట్రోయెన్ ‘బసాల్ట్ ఎక్స్’ కార్లు
ధర రూ. 7.95 లక్షల నుంచి ప్రారంభం
కార్ల కంపెనీ సిట్రోయెన్ ఇండియా తాజాగా బసాల్ట్ ఎక్స్ శ్రేణి కార్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.95 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో దేశీయంగా తొలిసారి ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెంట్ ‘కారా’, ప్రీమియం ఇంటీరియర్స్, క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, రిమోట్ స్టార్ట్, ఆరు ఎయిర్ బ్యాగ్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. సెప్టెంబర్ మధ్య నుంచి ఇవి టెస్ట్ డ్రైవ్‌లకు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.