న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ : హీరోమోటో కొత్త బైక్‌

HeroMotoCorp launches 100-CC BS-VI motorcycle –HF Deluxe at Rs 55925 - Sakshi

సాక్షి,ముంబై : హీరోమోటో కొత్త ఏడాదిలో సరికొత్త బైక్‌ను లాంచ్‌ చేసింది.100సీసీ సెగ్మెంట్‌లో బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా తన తొలి  మోటార్‌ సైకిల్‌  తీసుకొచ్చింది.  హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ  బైక్‌ ప్రారంభ ధరను రూ. 55925 గా నిర్ణయించింది.

2020 ఏప్రిల్‌ నుంచి కొత్త ఉద్గార నిబంధనలు అమలుకానున్న నేపథ్యంలో కంపెనీ  బీఎస్‌-6 ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో వేగం పెంచింది. హీరో బైక్స్‌ లవర్స్‌కు  కొత్త సంవత్సరం బహుమతిని అందించింది.  తన పాపులర్‌, ఐకానిక్ మోటారుసైకిల్ హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌ బీఎస్‌-6 మోడల్‌ను రెండు వేరియంట్లలో లాంచ్‌ చేసింది. సెల్ఫ్-స్టార్ట్ అల్లాయ్-వీల్ వేరియంట్‌ ధర రూ. 55,925 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), సెల్ఫ్-స్టార్ట్ అల్లాయ్-వీల్ ఐ3ఎస్ వేరియంట్‌ రూ.57,250 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద దేశంలోని హీరో మోటోకార్ప్ షోరూమ్‌లలో జనవరి 2020 ప్రారంభం నుండి  అందుబాటులో వుంటాయని హీరోమోటో ఒకప్రకటనలో వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top