ఎక్స్‌ట్రీమ్‌లో కొత్త వేరియంట్ | Hero MotoCorp launches new version of 'Xtreme Sports' | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ట్రీమ్‌లో కొత్త వేరియంట్

Jul 1 2015 2:02 AM | Updated on Sep 3 2017 4:38 AM

ఎక్స్‌ట్రీమ్‌లో కొత్త వేరియంట్

ఎక్స్‌ట్రీమ్‌లో కొత్త వేరియంట్

హీరోమోటోకార్ప్ కంపెనీ 150 సీసీ కేటగిరీలో అప్‌డేటెడ్ వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది...

ధర రూ. 72,725
న్యూఢిల్లీ:
హీరోమోటోకార్ప్ కంపెనీ 150 సీసీ కేటగిరీలో అప్‌డేటెడ్ వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ పేరుతో ఈ అప్‌డేటెట్ వేరియంట్‌ను అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఈ బైక్ దర రూ.72,725 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని పేర్కొంది. కొత్త రకంగా డిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్, ట్విన్ ఎల్‌ఈడీ పైలట్ ల్యాంప్స్ తదితర ప్రత్యేకతలున్నాయని వివరించింది. శక్తివంతమైన ఇంజిన్, స్టైల్‌ల కలబోతగా రూపొందించిన ఈ బైక్‌కు మంచి ఆదరణ లభించగలదని కంపెనీ ఆశిస్తోంది. గత నెలలో కంపెనీ అందించిన రెండవ ఉత్పత్తి ఇది. గత నెల ప్రారంభంలో ప్యాషన్ ప్రొలో అప్‌డేటెడ్ వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement