హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం 2,925 కోట్లు | HCL Tech Q1 net profit up 31 persant at ₹2,925 crore | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం 2,925 కోట్లు

Published Sat, Jul 18 2020 5:33 AM | Last Updated on Sat, Jul 18 2020 5:33 AM

HCL Tech Q1 net profit up 31 persant at ₹2,925 crore - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) తొలి త్రైమాసిక కాలంలో 32 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ1లో రూ.2,220 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.2,925 కోట్లకు పెరిగిందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. ఆదాయం రూ.16,425 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.17,841 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే,  మాత్రం 4 శాతం క్షీణించిందని పేర్కొంది. పటిష్టమైన డీల్స్‌ సాధించామని రానున్న క్వార్టర్లలో మంచి వృద్ధినే సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేసింది.  అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులకు ఎలాంటి వేతన పెంపు లేదని స్పష్టం చేసింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2 డివిడెండ్‌ ప్రకటించింది. మరిన్ని వివరాలు...

► స్థిర కరెన్సీ ధరల్లో కంపెనీ ఆదాయం క్యూ1లో 1 శాతం మేర వృద్ధి చెందింది.  
► రానున్న మూడు క్వార్టర్లలో ఒక్కో క్వార్టర్‌కు 1.5–2.5 శాతం మేర వృద్ధి సాధిస్తామని కంపెనీ అంచనా వేస్తోంది.
► మార్చి క్వార్టర్‌తో పోల్చితే డీల్స్‌ 40 శాతం పెరిగాయి.  
► ఈ క్యూ1లో స్థూలంగా 7,005 ఉద్యోగాలిచ్చింది. జూన్‌ క్వార్టర్‌ చివరి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,50,287కు పెరిగింది. మొత్తం ఉద్యోగుల్లో 96 శాతం మంది ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. ఆట్రీషన్‌ రేటు (ఉద్యోగుల వలస)14.6 శాతంగా ఉంది.  


ఆర్థిక ఫలితాలు ప్రకటించిన తర్వాత హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్‌ 3 శాతం లాభంతో రూ.644కు ఎగసింది. చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 1 శాతం నష్టంతో రూ.623 వద్ద ముగిసింది.

ఇప్పటి నుంచి అంతా సానుకూల వృద్ధే....
ప్రపంచమంతా తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో ఈ ఆర్థిక సంవత్సరాన్ని ఆరంభించాం. ఈ క్యూ1లో అంచనాలకనుగుణంగానే ఓ మోస్తరు వృద్ధి మాత్రమే సాధింగలిగాం. అధ్వాన పరిస్థితులను అధిగమించాం. ఇక ఇప్పటి నుంచి అంతా సానుకూల వృద్ధే. హెచ్‌1 బీ వీసాలపై నిషేధం దురదృష్టకరం. అయితే ఈ ప్రభావం మా కంపెనీపై పెద్దగా ఉండదు. అమెరికాలో 67 శాతం మంది ఉద్యోగులు అక్కడి స్థానికులే.  
–విజయకుమార్, ప్రెసిడెంట్, సీఈఓ, హెచ్‌సీఎల్‌ టెక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement