ఆ ఏటీఎంలో కార్డు స్వైప్‌ చేస్తే, లక్షలు మాయం

Gurugram ATM Clones Cards, Lakhs Vanish - Sakshi

ఇటీవల ఏటీఎంలలో కార్డు స్వైప్‌ చేయాలన్న భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. బ్యాంకు ఏటీఎంల ద్వారా కూడా కస్టమర్ల కార్డు వివరాలను చోరి చేసి, లక్షల కొద్దీ రూపాయలను మాయం చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలోని దాదాపు 50 మంది ఉద్యోగులు ఎంతో కష్టించి సంపాదించుకున్న నగదును పోగొట్టుకున్నారు. దీనికి కారణం గురుగ్రామ్‌లోని యునిటెక్‌ సైబర్‌ పార్క్‌ వద్దనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలో కార్డు స్వైప్‌ చేయడమే. ఆ ఏటీఎంలో డెబిట్‌ కార్డులను స్వైప్‌ చేసిన అనంతరం తమ నగదును కోల్పోయినట్టు మెసేజ్‌లు వచ్చినట్టు ఉద్యోగులు ఫిర్యాదులు చేశారు. అమెరికాలో తమ అకౌంట్ల నుంచి నగదును విత్‌డ్రా అయినట్టు మెసేజ్‌ వచ్చినట్టు నరేష్‌ నోయిడా, నీరజ్‌ జైన్‌లు అనే బాధితులు పేర్కొన్నారు. ఈ మోసంపై వెంటనే వీరు పోలీసు ఫిర్యాదు దాఖలు చేశారు. ఇతర బాధితులు కూడా పోలీసులను ఆశ్రయించారు. 

ఆ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలో కార్డు స్వైప్‌చేస్తే, ఆ ఏటీఎం తమ కార్డు వివరాలన్నింటిన్నీ చోరి చేస్తుందని బాధితులు పేర్కొన్నారు. ఏప్రిల్‌లోనే ఈ ఏటీఎంలో ఓ డివైజ్‌ ఇన్‌స్టాల్‌చేసి, ఉద్యోగులకు వేతనాలు రావడమే నగదును సైబర్‌ నేరగాళ్లు బదలాయించుకుంటున్నట్టు తెలుస్తోంది. ‘యునిటెక్‌ సైబర్‌ పార్క్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో నా ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్‌ కార్డుని వాడిన అనంతరం దాదాపు రూ.22,536 రూపాయలు మే 1న నా అకౌంట్‌ నుంచి డ్రా అయినట్టు మెసేజ్‌ వచ్చింది’ అని ఈ స్కాం బారిని పడిన శుభంకర్‌ చావ్లా పేర్కొన్నారు. తాను లక్షకు పైగా పోగొట్టుకున్నానని మనీష్‌ అరోరా అనే మరో ఉద్యోగి చెప్పారు. ఇలా నగదును పోగొట్టుకున్న పలువురు ఈ స్కాంపై ఫిర్యాదు చేశారు. అయితే తమ ఏటీఎం సమస్య బారిన పడిన కస్టమర్లకు నగదును తాము రీఫండ్‌ చేస్తామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు హామీఇచ్చింది. గురుగ్రామ్‌ ఏటీఎంలో నెలకొన్న సమస్య తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేపడుతున్నామని, ఎవరూ ఆర్థికంగా నష్టపోరని బ్యాంకు కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ హెడ్‌నీర్‌ జా అన్నారు. ఈ అంతరాయానికి తాము చింతిస్తున్నట్టు పేర్కొన్నారు.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top