జీఎస్‌ఎం మొబైల్ సబ్‌స్క్రైబర్లు @78 కోట్లు | GSM Subscriber Base Crossed 781 Million in August, Says COAI | Sakshi
Sakshi News home page

జీఎస్‌ఎం మొబైల్ సబ్‌స్క్రైబర్లు @78 కోట్లు

Sep 23 2016 1:46 AM | Updated on Sep 4 2017 2:32 PM

జీఎస్‌ఎం మొబైల్ సబ్‌స్క్రైబర్లు @78 కోట్లు

జీఎస్‌ఎం మొబైల్ సబ్‌స్క్రైబర్లు @78 కోట్లు

దేశంలో మొబైల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 78.1 కోట్లను అధిగమించింది. ఆగస్ట్ నెలలో వీరి సంఖ్య కొత్తగా...

న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 78.1 కోట్లను అధిగమించింది. ఆగస్ట్ నెలలో వీరి సంఖ్య కొత్తగా 20.9 లక్షల మేర పెరిగింది. జూలైలో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 77.9 కోట్లుగా ఉంది. సెల్యులార్ ఆపరేటర్స్ సమాఖ్య సీవోఏఐ గణాంకాల ప్రకారం.. భారతీ ఎయిర్‌టెల్ యూజర్ల సంఖ్య 25.75 కోట్లుగా ఉంది. అంటే దేశంలోని మొత్తం జీఎస్‌ఎం యూజర్లలో 33 శాతం ఎయిర్‌టెల్‌కి చెందిన వారే ఉన్నారు. వొడాఫోన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 20 కోట్లుగా, ఐడియా వినియోగదారుల సంఖ్య 17.7 కోట్లుగా ఉంది. ఇక ఎయిర్‌సెల్‌కి 8.9 కోట్ల మంది, టెలినార్‌కి 5.32 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement