
టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) హైదరాబాద్‌లో కేబుల్స్ తొలగించడం వల్ల, నగరంలో ఫైబర్ టు హోమ్ కనెక్టివిటీ సమస్యలు తలెత్తాయి. ఇది పెద్ద సంఖ్యలో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు అంతరాయాన్ని కలిగించింది.
విద్యుత్ శాఖ ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌లను విచక్షణారహితంగా.. కత్తిరించడం వల్ల ఈ (ఇంటర్నెట్) అంతరాయం ఏర్పడింది. ఇంటర్నెట్ కేబుల్‌లు విద్యుత్తును తీసుకువెళ్లవని.. దీనివల్ల విద్యుత్ మౌలిక సదుపాయాలకు సంబంధం లేదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) చెబుతోంది. విచక్షణారహితంగా కేబుల్స్ కట్ చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని శాఖను కోరుతున్నామని వెల్లడించింది.
ఇదీ చదవండి: అమెరికా సుంకాలు.. రిస్క్‌లో 3 లక్షల ఉద్యోగాలు!
నగరంలో తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి.. ఇంటర్నెట్ సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి సంబంధిత శాఖ పనిచేస్తోంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ దెబ్బతినడం వల్ల చాలా ముఖ్యమైన సేవలు నిలిచిపోతాయి. ప్రస్తుతం ఈ ప్రభావం జియో, ఎయిర్‌టెల్‌లకు చెందిన దాదాపు 40 వేల ఫైబర్ కస్టమర్లపై పడింది.