గూగుల్‌ షాపింగ్‌ పోర్టల్‌ వచ్చేసింది

Google Shopping launches in India - Sakshi

గూగుల్‌ షాపింగ్‌ పోర్టల్‌ లాంచ్‌

దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌  తదితర ఉత్పత్తులు

భారతదేశంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌నకు పెరుగుతున్న  ఆదరణ నేపథ్యంలో గూగుల్‌ కూడా ఆన్‌లైన్‌ షాపింగ్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దేశంలో ‘గూగుల్‌ షాపింగ్‌’ పేరుతో  కొత్త షాపింగ్‌ ప్లాట్‌ఫాంను  గురువారం (డిసెంబరు 13) లాంచ్‌​ చేసింది.. ఈ రోజు నుంచే  గూగుల్ షాపింగ్‌ పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిందని గూగుల్‌  ప్రకటించింది. ఇందులో దుస్తులు, ఎలక్ట్రానిక్స్, పుస్తకాలు సహా వివిధ విభాగాలలో ఉత్పత్తులను వికయిస్తుంది.  వివిధ కంపెనీల, బ్రాండ్ల ఉత్పత్తులను  గూగుల్‌ షాపింగ్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది.

వినియోగదారులు సరైన ఉత్పత్తులు, విక్రయించే రిటైలర్ల సమాచారాన్ని తెలుసుకోవడంలోసహాయపడేలా గూగుల్ షాపింగ్  పోర్టల్ల్‌ను డిజైన్‌ చేసినట్టు తెలిపింది.  ఇంగ్లీష్‌తోపాటు హిందీ భాషలోలో ధరలు, బెస్ట్‌డీల్స్‌ తదితర సమాచారాన్నితెలుసుకునే వీలు కల్పించామని పేర్కొంది. లక్షలాదిమంది ఆన్‌లైన్ వినియోగదారులకు ఉత్పత్తులను విక్రయించుకునేందుకు రీటైల్‌ వ్యాపారులకు ఇది గొప్ప అవకాశమని గూగుల్ షాపింగ్  ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సురోజిత్ చటర్జీ బ్లాగ్ పోస్ట్ లో రాశారు. అలాగే డెస్క్‌టాప్‌తోపాటు ఎంట్రీ లెవల్  మొబైల్స్‌లో కూడా పనిచేసేలా ఒక  ప్రోగ్రెసివ్‌ వెబ్‌యాప్‌ను  త్వరలోనే లాంచ్‌ చేస్తామన్నారు.

కాగా దేశంలో 400 మిలియన్లమంది ఇంటర్నెట్‌ యూజర్లు ఉండగా వీరిలో కేవలం మూడవ వంతు  వినియోగదారులు అసలు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయడం లేదనిగూగుల్‌ పేర్కొంది.  తమ గూగుల్‌ షాపింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ప్రోత్సాహం అందించడంతోపాటు  చిన్నమధ్యతరహా వ్యాపారస్తులను ఆన్‌లైన్‌ బిజినెస్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top