రాన్సమ్ వేర్ తర్వాత టార్గెట్ అవే..బీ అలర్ట్! | Global cyber attack isn't over yet, your phone could be ransomware's next target | Sakshi
Sakshi News home page

రాన్సమ్ వేర్ తర్వాత టార్గెట్ అవే..బీ అలర్ట్!

May 18 2017 12:25 PM | Updated on Nov 6 2018 5:26 PM

రాన్సమ్ వేర్ తర్వాత టార్గెట్ అవే..బీ అలర్ట్! - Sakshi

రాన్సమ్ వేర్ తర్వాత టార్గెట్ అవే..బీ అలర్ట్!

ప్రపంచాన్ని గడగడలాడించిన వన్నాక్రై రాన్సమ్ వేర్ ముప్పు తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్నారేమో.. ఈ భారీ సైబర్ దాడి ముప్పు మళ్లీ పొంచి ఉందని సైబర్ సెక్యురిటీ ఏజెన్సీలు వార్నింగ్ ఇస్తున్నాయి.

న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గడగడలాడించిన వన్నాక్రై రాన్సమ్ వేర్ ముప్పు తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్నారేమో.. ఈ భారీ సైబర్ దాడి ముప్పు మళ్లీ పొంచి ఉందని సైబర్ సెక్యురిటీ  ఏజెన్సీలు వార్నింగ్ ఇస్తున్నాయి. ఇంకా దీని కథ ముగియలేదని, ఏ క్షణానైనా మళ్లీ ఈ సైబర్ దాడి పొంచుకురావచ్చని  ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్టర్ సంజయ్ బాహల్ చెప్పారు.

అయితే తర్వాతి టార్గెట్ అరచేతిలో ప్రపంచాన్ని నిలుపుతున్న స్మార్ట్ ఫోన్లేనని సంజయ్ హెచ్చరించారు. గత శుక్రవారం విజృంభించిన ఈ వన్నాక్రై అటాక్ తో  ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెండు లక్షలకు పైగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో పనిచేసే డెస్క్ టాప్స్, ల్యాప్ టాప్స్ స్తంభించాయి. పీసీల డేటా అంతా తమ గుప్పిట్లోకి తీసుకుని ఈ అటాకర్లు నానా హంగామా చేశారు. మరోసారి విజృంభించబోయే వన్నాక్రై అటాక్ స్మార్ట్ ఫోన్లకేనని తెలియడంతో తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి.
 
మొబైల్స్ లో అత్యధికులు వాడేది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ నే. ఒకవేళ హ్యాకర్లు కనుక దీన్నే టార్గెట్ చేస్తే, ప్రపంచమంతా ఏమవుతుందో కూడా అర్థం కావడం లేదని సంజయ్ చెప్పారు. హ్యాకర్లు రెండు దశలో ముందుకు వెళ్తున్నారని, అయితే తర్వాత ఏంటన్నది తెలియడం లేదని చెప్పారు. ఒకవేళ  ఈ  అటాక్స్ ను ఆపవచ్చు లేదా వేరియంట్లను టార్గెట్ చేసి మరోమారు తమ ప్రతాపం చూపవచ్చని తెలిపారు.

బ్యాంకులకు, పవర్ యుటిలిటీస్ కు, రైల్వేస్, ఇతర కీలక  ఇన్ ఫ్రాక్ట్ర్చర్ ప్రొవేడర్లకు వారమంతా అలర్ట్ లు పంపుతూనే ఉన్నామని, తర్వాత అటాక్ కు ముందస్తుగా ప్రైవేట్ వ్యక్తులతో డైరెక్ట్ గా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. వన్నాక్రై అటాక్ పై అధ్యయనం చేయడానికి ఏజెన్సీ ఓ టీమ్ కూడా నియమించింది. హ్యాకర్లు తర్వాతి టార్గెట్ స్మార్ట్ ఫోన్లే నిజమైతే, ప్రపంచానికి తీవ్ర ముప్పే వాటిల్లనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లుంటున్నాయి. డిజిటల్ కార్యకలాపాలు భారీగా విస్తరిస్తున్నప్పటి నుంచి స్మార్ట్ ఫోన్ వాడని వారే కనిపించడం లేదు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement