గుడ్‌న్యూస్‌: కరోనా డ్రగ్‌ ధర తగ్గింది

Glenmark Pharma cuts price of COVID19 drug by 27 pc to Rs 75 tablet - Sakshi

కరోనా మందు ధర తగ్గించిన గ్లెన్‌మార్క్‌

ఫాబిఫ్లూ టాబ్లెట్‌ ప్రస్తుత ధర  75 రూపాయలు

సాక్షి, ముంబై : కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న తరుణంలో  గ్లెన్‌మార్క్‌  కాస్త ఊరట నిచ్చింది. తన యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ ధరను 27శాతం తగ్గించింది. ఫాబిఫ్లూ టాబ్లెట్‌ ధరను తగ్గించి 75 రూపాయలకు అందిస్తున్నట్టు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్  సోమవారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.  కొత్త గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్‌పి) ప్రతి మాత్రకు 75 రూపాయలుగా ఉంటుందని తెలిపింది.  గత నెలలో టాబ్లెట్‌కు 103 రూపాయల చొప్పున విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇతర దేశాలలో ఫావిపిరవిర్ ఖర్చుతో పోల్చితే భారతదేశంలో ఫాబిఫ్లూను అతి తక్కువ మార్కెట్ ఖర్చుతో ప్రారంభించామని, ఇపుడు ఇండియాలో తయారు కావడం, అధిక  ఉత్పత్తి కారణంగా  తక్కువ ధరతో అందుబాటులోకి తెచ్చామని సంస్థ  ఇండియా బిజినెస్  హెడ్‌, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ మాలిక్ వెల్లడించారు. తద్వారా  కరోనా రోగులకు తమ ఔషధం మరింత చేరువ వుందని తాము ఆశిస్తున్నామన్నారు.  అలాగే ఇండియాలో కోవిడ్‌-19  రోగుల్లో  కాంబినేషన్ థెరపీగా రెండు యాంటీవైరల్స్ డ్రగ్స్‌ షావిపిరవిర్, ఉమిఫెనోవిర్ సామర్థ్యాన్ని అంచనా వేసే మరో దశ 3 క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.  (సోనూ సూద్‌ మరోసారి ఉదారత)

చదవండి :  ఫోటోగ్రఫీ ‘పిచ్చి’ : చివరికి కొడుకులకు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top