జియోని బ్రాండ్‌ అంబాసిడర్‌గా విరాట్‌ కోహ్లి | Gionee signs up Virat Kohli as brand ambassador | Sakshi
Sakshi News home page

జియోని బ్రాండ్‌ అంబాసిడర్‌గా విరాట్‌ కోహ్లి

Jan 10 2017 4:02 AM | Updated on Sep 5 2017 12:49 AM

జియోని బ్రాండ్‌ అంబాసిడర్‌గా విరాట్‌ కోహ్లి

జియోని బ్రాండ్‌ అంబాసిడర్‌గా విరాట్‌ కోహ్లి

జియోని బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి వ్యవహరించనున్నారు.

త్వరలో ప్రచార కార్యక్రమాలు
న్యూఢిల్లీ: జియోని బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌  కోహ్లి వ్యవహరించనున్నారు. ఈ మేరకు కోహ్లితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని జియోని తెలిపింది. ఇప్పటికే తమ సంస్థకు ప్రముఖ హిందీ సినిమా నటి అలియాభట్‌ బ్రాండ్‌  అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని జియోని ఇండియా సీఈఓ, ఎండీ అర్వింద్‌ ఆర్‌. వోహ్రా పేర్కొన్నారు.

జియోని త్వరలో చేపట్టబోయే ప్రచార కార్యక్రమాల్లో విరాట్‌ పాల్గొంటారని, తమ బ్రాండ్‌ కొత్త శిఖరాలకు చేరడానికి ఆలియాతో కలసి ఆయనఇతోధికంగా తోడ్పడుతారని వివరించారు. గత నాలుగేళ్లలో 1.2 కోట్ల మొబైల్స్‌ను విక్రయించామని పేర్కొన్నారు. భారత్‌లో తమకు ప్రస్తుతం వంద బ్రాండ్‌ స్టోర్స్‌ ఉన్నాయని, వీటిని వచ్చే ఏడాది మార్చికల్లా 500కు పెంచనున్నామని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement