జనరల్ మోటార్స్ కార్ల రేట్లు పెంపు | General Motors India to raise prices by up to 2% from January | Sakshi
Sakshi News home page

జనరల్ మోటార్స్ కార్ల రేట్లు పెంపు

Dec 12 2015 1:50 AM | Updated on Sep 3 2017 1:50 PM

జనరల్ మోటార్స్ కంపెనీ కూడా కార్ల ధరలను పెంచుతోంది. వచ్చే నెల నుంచి అన్ని మోడళ్ల

న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ కంపెనీ కూడా కార్ల ధరలను పెంచుతోంది. వచ్చే నెల నుంచి అన్ని మోడళ్ల ధరలను 2% వరకూ పెంచుతున్నామని జనరల్ మోటార్స్ తెలిపింది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, విదేశీ మారకద్రవ్య ఒడిదుడుకులను తట్టుకోవడానికి ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీ పేర్కొంది.
 
 ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్‌యూవీ) ట్రైల్‌బ్లేజర్‌కు ధరల పెంపు వర్తించదని పేర్కొంది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుండడం, విదేశీ మారకద్రవ్య ఒడిదుడుకులను తట్టుకోవడానికి పలు కార్ల కంపెనీలు వివిధ మోడళ్ల ధరలను వచ్చే నెల నుంచి పెంచుతున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టయోటా, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ కంపెనీలు ధరలను పెంచనున్నట్లు పేర్కొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement