గీతాంజలి జెమ్స్‌ సీఎఫ్‌ఓ రాజీనామా | Geetanjali Jims CFO resigns | Sakshi
Sakshi News home page

గీతాంజలి జెమ్స్‌ సీఎఫ్‌ఓ రాజీనామా

Feb 20 2018 12:05 AM | Updated on Feb 20 2018 12:05 AM

Geetanjali Jims CFO resigns - Sakshi

న్యూఢిల్లీ: గీతాంజలి జెమ్స్‌ సీఎఫ్‌ఓ చంద్రకాంత్‌ కర్కరే రాజీనామా చేశారు. రూ.11,400 కోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ స్కామ్‌లో గీతాంజలి జెమ్స్‌కు కూడా భాగస్వామ్యం ఉందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

పీఎన్‌బీ స్కామ్‌లో కీలకమైన వ్యక్తి నీరవ్‌ మోదీకి వ్యాపార భాగస్వామి అయిన మెహుల్‌ చోక్సికి చెందిన గీతాంజలి జెమ్స్‌ షేర్‌.. ఈ స్కామ్‌ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పతనమవుతూనే ఉంది. కంపెనీ సీఎఫ్‌ఓతో పాటు కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌(కంప్లయన్స్‌), కంపెనీ సెక్రటరీ కూడా అయిన పంఖురి, బోర్డ్‌ సభ్యుడు కృష్ణన్‌ సంగమేశ్వరన్‌లు కూడా రాజీనామా చేశారని గీతాంజలి జెమ్స్‌ తెలిపింది.

4 రోజుల్లో 46 శాతం డౌన్‌..
గీతాంజలి జెమ్స్‌ కంపెనీ షేర్‌ వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ పతనమైంది. సోమవారం  ఈ షేర్‌ 10 శాతం నష్టపోయి రూ.33.80 వద్ద ముగిసింది. గత నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో ఈ షేర్‌ 46 శాతం క్షీణించింది. మొత్తం మార్కెట్‌ క్యాప్‌ రూ.344 కోట్లు హరించుకుపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement