ఫ్లిప్‌​కార్ట్‌ బొనాంజా సేల్‌ : బెస్ట్‌ డీల్స్‌ ఏవి?

Flipkart Mobiles Bonanza Sale Kicks Off With Deals Smartphones - Sakshi

 నవంబరు 19-22వరకు బొనాంజా సేల్‌

 ఆపిల్‌,  శాంసంగ్‌, షావోమి, గూగుల్‌, ఫోన్లపై ఆఫర్లు

సాక్షి,ముంబై: ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ను మరోసారి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ బొనాంజా సేల్‌ పేరుతో ఈ స్పెషల్‌ సేల్‌ను ప్రకటించింది. నవంబర్ 19 అర్థరాత్రి నుంచి ప్రారంభమై 22వరకు కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్ అమ్మకాలపై ప్రధానంగా దృష్టిపెట్టిన ఫ్లిప్‌కార్ట్ పలు కంపెనీల మొబైల్స్‌ను తగ్గింపు ధరలతో అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్‌, షావోమీ, రియల్‌మీ, నోకియా, గూగుల్, ఆసుస్ లాంటి ఫోన్లపై భారీ ఆఫర్లను వెల్లడించింది. దీంతోపాటు రూ.99 కే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను కూడా అందిస్తోంది.

ఆపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌:  ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇపుడు కేవలం రూ. 79,999లకే లభ్యం.  దీనికి తోడు 14,900 ఎక్స్చేంజ్  ఆఫర్‌ కూడా ఉంది. అలాగే యాక్సిస్‌ బ్యాంకు కార్డు ద్వారాచేసే కొనుగోళ్లపై  5శాతం డిస్కౌంట్‌ అదనం.
శాంసంగ్‌ గెలాక్స్‌ ఎస్‌ 9:  ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరలు 57,999 నుంచి ప్రారంభం.  దీనికి తోడు 14,900 ఎక్స్చేంజ్  ఆఫర్‌ కూడా.
హానర్‌ 9 ఎన్‌ : తాజా సేల్‌ లో ప్లిప్‌కార్ట్‌లో  హానర్‌ 9 ఎన్‌(32జీబీ) రూ. 9,999లకే లభ్యం. దీని లాంచింగ్‌ ధర రూ.13,999లు. దీనికి తోడు 9,450 ఎక్స్చేంజ్  ఆఫర్‌ కూడా ఉంది. అలాగే యాక్సిస్‌ బ్యాంకు కార్డు ద్వారా  జరిపిన  కొనుగోళలపై మరో 5శాతం డిస్కౌంట్‌.
పోకో ఎఫ్1 : ఫ్లిప్‌కార్ట్‌ తాజా సేల్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇపుడు 18,999లకే లభ్యం. రూ.2,000 ఎక్స్చేంజ్ ఆఫర్‌తో ఈ తగ్గింపు లభిస్తోంది.
గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్‌: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.4500 డిస్కౌంట్. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్‌లో ధర రూ.40,999. ఎంఆర్‌పీ రూ.45,499.
ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1: 3 జీబీ+4జీబీ వేరియంట్ రూ.9,999 ధరకే లభిస్తుంది. అసలు ధర రూ.10,999. 4జీబీ+64జీబీ ధర ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్‌లో ధర రూ.10,499లభ్యం. ఎంఆర్‌పీ ధర రూ.12,999 ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 ఫోన్లపై భారీ ఆఫర్లున్నాయి. 3 జీబీ+4జీబీ వేరియంట్ రూ.9,999 ధరకే లభిస్తుంది. అసలు ధర రూ.10,999. 4జీబీ+64జీబీ లాంచింగ్‌ ధర రూ.12,999.  కాగా ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్‌లో ధర రూ.10,499. దీంతోపాటు రెడ్‌నోట్ 5 ప్రో, ఎంఐ ఏ2, రెడ్‌మీవై2 ఫోన్లు దాదాపు వెయ్యి రూపాయల తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top