మ్యాప్‌మైఇండియాలో వాటా కొన్న ఫ్లిప్‌కార్ట్ | Flipkart buys stake in MapmyIndia to improve delivery operations | Sakshi
Sakshi News home page

మ్యాప్‌మైఇండియాలో వాటా కొన్న ఫ్లిప్‌కార్ట్

Dec 4 2015 3:36 AM | Updated on Aug 1 2018 3:40 PM

మ్యాప్‌మైఇండియాలో వాటా కొన్న ఫ్లిప్‌కార్ట్ - Sakshi

మ్యాప్‌మైఇండియాలో వాటా కొన్న ఫ్లిప్‌కార్ట్

నావిగేషన్, ట్రాకింగ్ సొల్యూషన్స్ అందించే మ్యాప్‌మైఇండియా సంస్థలో వ్యూహా త్మక మైనారిటీ వాటాను ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది.

బెంగళూరు: నావిగేషన్, ట్రాకింగ్ సొల్యూషన్స్ అందించే మ్యాప్‌మైఇండియా సంస్థలో వ్యూహా త్మక మైనారిటీ వాటాను ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది. సరఫరా చెయిన్ నిర్వహణను మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ వాటాను కొనుగోలు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు. ఫ్లిప్‌కార్ట్ వాటా కొనుగోలుతో మ్యాప్‌మైఇండియాకు ప్రారంభంలో పెట్టుబడులు అందించిన నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్, లైట్‌బాక్స్ వెంచర్స్ సంస్థలు మ్యాప్‌మైఇండియా నుంచి నిష్ర్కమిస్తాయి. మ్యాప్‌మైఇండియా స్వతంత్రగానే కార్యకలాపాలను కొనసాగిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement