హెచ్‌డీఎఫ్‌సీ నుంచి తొలి హౌసింగ్‌ ఫండ్‌ | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ నుంచి తొలి హౌసింగ్‌ ఫండ్‌

Published Tue, Nov 21 2017 11:58 PM

First Housing Fund from HDFC - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి అందరికీ ఇల్లు అన్న నినాదం ఇవ్వడమే కాకుండా ఆ దిశగా పలు చర్యలు చేపడుతుండటంతో ఈ రంగంలో వృద్ధి అవకాశాల నుంచి ఇన్వెస్టర్లకు రాబడులను పంచే లక్ష్యంతో ‘హౌసింగ్‌ అపర్చూనిటీస్‌’ పేరుతో థీమాటిక్‌ ఫండ్‌ ను ప్రవేశపెడుతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ప్రకటించింది.

ఈ పథకం ద్వారా ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తాన్ని హౌసింగ్‌ ఫైనాన్స్, స్టీల్, సిమెంటు, పెయింట్స్, టైల్స్, వుడెన్‌ ప్యానెల్స్, శానిటరీవేర్, హోమ్‌ అప్లయెన్సెస్‌ తదితర షేర్లలో ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు తెలిపింది. ఇది క్లోజ్‌డ్‌ ఎండెడ్‌ థీమాటిక్‌ పథకం. అంటే ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసిన వారు 1,140 రోజుల వరకు వైదొలగడానికి ఉండదు. నవంబర్‌ 16న ప్రారంభమైన ఈ ఎన్‌ఎఫ్‌వో నవంబర్‌ 30న ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్‌మెంట్‌ మొత్తం రూ.5,000గా నిర్ణయించారు. ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్‌గా శ్రీనివాసరావు రావూరి వ్యవహరిస్తున్నారు. గరిష్టంగా 80 నుంచి 85 శాతం ఈక్విటీల్లో, మిగిలిన మొత్తం డెట్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు.

Advertisement
Advertisement