
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో కో లెండింగ్ (80:20 నిష్పత్తిలో) భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇరు సంస్థలు కలసి ఉమ్మడిగా రుణాలు ఇవ్వనున్నాయి. సెపె్టంబర్ త్రైమాసికానికి బలమైన పనితీరు నమోదు చేసింది. బ్యాంకుల రుణ ఆస్తుల నాణ్యత కూడా బలపడింది.
నికర లాభం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 33 శాతం వృద్ధితో రూ.1,213 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో బ్యాంక్ ఆర్జించిన లాభం రూ.913 కోట్లుగానే ఉంది. బ్యాంక్ మొత్తం వ్యాపారం విలువ సెప్టెంబర్ చివరికి 14 శాతానికి పైగా పెరిగి రూ.7.38 లక్షల కోట్లకు చేరింది.
బ్యాంక్ మొత్తం రుణాల్లో వసూలు కాని స్థూల మొండి బాకీలు (ఎన్‌పీఏలు) క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న 4.59% నుంచి 3.01 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు (కేటాయింపుల అనంతరం) సైతం ఇదే కాలంలో 0.69% నుంచి 0.48 శాతానికి దిగొచ్చాయి. క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 17.34 శాతంగా ఉంది.