ఈ నెలాఖరు వరకు ఉచిత ఫాస్టాగ్‌

FASTag to be available free of charge for 15 days - Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ టోల్‌ సేకరణను మరింత మెరుగుపరచడం కోసం ఈ నెలాఖరు వరకు ఫాస్టాగ్‌లను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా బుధవారం ప్రకటించింది. జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే వాహనానికి ఫాస్టాగ్‌ తప్పనిసరి కాగా, ఈ ఏర్పాటు నిమిత్తం వసూలు చేస్తున్న రూ. 100 చార్జీని ఈ నెల 15 నుంచి 29 వరకు ఎత్తివేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. వినియోగదారులు తమ వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ (ఆర్‌సీ)ని జాతీయ రహదారి ఫీజు ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, పెట్రోల్‌ పంపులు వంటి ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ వద్ద చూపించి ఫాస్టాగ్‌ను పొందవచ్చని వివరించింది. మైఫాస్టాగ్‌ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకుని దగ్గర్లోని సెంటర్‌ను తెలుసుకోవచ్చు. ఇక ఫాస్టాగ్‌ వాలెట్‌లో సెక్యూరిటీ డిపాజిట్, కనీస బ్యాలెన్స్‌ వంటి మిగిలిన అంశాల్లో మార్పులు లేవని స్పష్టంచేసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top