డేటా బ్రీచ్‌: ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్

Facebook says it will overhaul privacy controls, introduce 'Access Your Information' feature - Sakshi

కోట్లాదిమంది వ్యక్తిగత సమాచారం లీక్‌ అయిందన్న దుమారంనుంచి బయటపడేందుకు సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ దిద్దుబాటు చర్యలకు దిగింది. యూజర్‌ డేటా బ్రీచ్‌ను అడ్డుకునేందుకు   ప్రైవసీ కంట్రోల్‌లో మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లోతాజాగా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నామని బుధవారం ప్రకటించింది. యూజర్ల గోప్యతను కాపాడే ప్రయత్నాల్లో భాగంగా ‘యాక్సెస్‌ యువర్‌ ఇనఫర్మేషన్‌’ అనే కొత్త ఫీచర్‌ను పరిశీలిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు డేటా చోరీలో థర్డ్‌ పార్టీ డేటా ప్రొవైడర్లకు చెక్‌ పెట్టేలా 'పార్టనర్ కేటగిరీలను' మూసివేస్తున్నట్లు కూడా  ప్రకటించింది.

రాబోయే వారాలలో డేటా సెక్యూరిటీ యూజర్ల నియంత్రణలో ఉంచడానికి అదనపు చర్యలు తీసుకుంటున్నామని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ అధికారి ఎరిన్ ఎగాన్,  డిప్యూటీ జనరల్ న్యాయవాది అషిలే బెరింగ్గెర్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. వినియోగదారులకు వారి సమాచారం భాగస్వామ్యంపై  మరింత నియంత్రణ ఇవ్వాలనే యోచనలో ఈ కొత్త గోప్యతా టూల్‌ ను పరిచయం చేయనున్నట్టు చెప్పింది. మెనూలో సెక్యూరిటీ షార్ట్‌కట్స్‌ ద్వారా  యూజర్ల  ఫేస్‌బుక్‌ ఖాతాలకు అదనపు భద్రతను అందించడంతోపాటు , వినియోగదారులు డేటా, యాక్టివిటీపై ఇతరుల యాక్సెస్‌ను మరింత నియంత్రిచుకోవచ్చని, యాడ్స్‌కు కూడా చెక్‌ పెట్టవచ్చని తెలిపారు. అయితే ఇది ఇంకా ప్రయోగదశలో ఉందనీ, త్వరలోనే  ఈ ఫీచర్‌ను లాంచ్‌ చేస్తామని వెల్లడించారు.

కాగా ఫేస్‌బుక్‌ డేటాలీక్‌ చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో సాధారణ యూజర్‌నుండి సెలబ్రిటీల దాకా ఫేస్‌బుక్‌ ఖాతా గోప్యతపై అందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వాట్సాప్‌ కో ఫౌండర్‌ బ్రియాన్‌ ప్రకనటతో డిలీట్‌ ఫేస్‌బుక్‌ ఉద్యమం  మరింత ఊపందుకుంది. మరోవైపు బాలీవుడ్‌ నటుడు ఫరాన్‌ అక్తర్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను శాశ్వతంగా డిలీట్‌ చేస్తున్నట్టు ప్రకటించిన తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top