బ్యాంకు ఉద్యోగులకు ఆరోగ్య బీమా | Employee Health Insurance | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఉద్యోగులకు ఆరోగ్య బీమా

Aug 3 2015 1:32 AM | Updated on Sep 3 2017 6:39 AM

బ్యాంకు ఉద్యోగులకు ఆరోగ్య బీమా

బ్యాంకు ఉద్యోగులకు ఆరోగ్య బీమా

అన్ని ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు బ్యాంకు ఉద్యోగుల కోసం కొత్తగా ఒక ఆరోగ్య బీమా పాలసీని మార్కెట్‌లోకి

ముంబై : అన్ని ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు బ్యాంకు ఉద్యోగుల కోసం కొత్తగా ఒక ఆరోగ్య బీమా పాలసీని మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. ఈ నెల చివరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ద్వారా ఒక మాస్టర్ మెడిక్లెయిమ్ పాలసీని బ్యాంకు ఉద్యోగులకు అందించడానికి బీమా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. బ్యాంకు యూనియన్లకు, ఐబీఏ మధ్య మే 25న కుదిరిన కొత్త వేతన ఒప్పందం ప్రకారం.. ఐబీఏలోని 43 సభ్యత్వ బ్యాంకులు వారి ఉద్యోగులకు ఒక ఆరోగ్య బీమా పాలసీని అందించాలి. ఉద్యోగుల ఆరోగ్య బీమా అంశంపై తాము ఐబీఏతో చర్చిస్తున్నట్లు న్యూ ఇండియా అస్యూరెన్స్ చైర్మన్, ఎండీ జి.శ్రీనివాసన్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement