మెహుల్‌ చోక్సీ ఆస్తులు ఈడీ జప్తు | ED Foreclosure Mehul Choksi Assets | Sakshi
Sakshi News home page

మెహుల్‌ చోక్సీ ఆస్తులు ఈడీ జప్తు

Jul 12 2019 12:55 PM | Updated on Jul 12 2019 12:55 PM

ED Foreclosure Mehul Choksi Assets - Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో రూ.13,000 కోట్లకుపైగా రుణ ఎగవేతల కేసులో మెహుల్‌ చోక్సీకి చెందిన రూ.22.77 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం జప్తు చేసింది. దుబాయ్‌లో మూడు కమర్షియల్‌ అసెట్స్, మెర్సిడెజ్‌ బెంజ్‌ కారు, దేశ విదేశాల్లో బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న కొన్ని ఫిక్సిడ్‌ డిపాజిట్లు జప్తు చేసిన వాటిలో ఉన్నాయి. అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద చోక్సీపై ఉత్తర్వులు జారీ అయినట్లు కూడా ఈ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా చర్యలతో కలుపుకుంటే, మొత్తం రూ.2,535 కోట్ల చోక్సీ ఆస్తుల జప్తు జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement