డ్యూయల్‌ సిమ్‌ ఐఫోన్‌ వచ్చేసింది | Dual SIM has come with iPhone | Sakshi
Sakshi News home page

డ్యూయల్‌ సిమ్‌ ఐఫోన్‌ వచ్చేసింది

Sep 13 2018 12:51 AM | Updated on Sep 13 2018 4:26 PM

Dual SIM has come with iPhone - Sakshi

క్యుపర్టినో, కాలిఫోర్నియా : టెక్‌ దిగ్గజం యాపిల్‌ మొట్టమదటిసారిగా డ్యూయల్‌ సిమ్‌ ఐఫోన్‌లను తీసుకొచ్చింది.  కొత్త ఐఫోన్‌తో పాటు పలు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. బుధవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌.. ఐఫోన్‌ 10ఎస్‌ ఫోన్లను  ఆవిష్కరించారు. 5.8 అంగుళాలు, 6.5 అంగుళాల (ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌) ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో ఇవి లభిస్తాయి. 64జీబీ, 256జీబీ, 512జీబీ మెమరీ వేరియంట్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్‌ 14 నుంచి వీటి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమై, సెప్టెంబర్‌ 21 నుంచి వీటి తొలి దశ డెలివరీ మొదలవుతుంది. రెండో దశ డెలివరీ సెప్టెంబర్‌ 28 నుంచి చేపట్టనుంది. ఆ సమయం నుంచే భారత్‌కు కూడా ఈ డివైజ్లు వస్తాయి. ఐఫోన్‌ 10ఎస్‌ ధర 999 డాలర్ల నుంచి ప్రారంభమవుతుండగా.. ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌ ధర 1099 డాలర్ల నుంచి మొదలువుతుంది. రెండింటిలో డ్యూయల్‌ సిమ్‌ ఆప్షన్‌ ను చేర్చారు.

వాచ్‌లలో సిరీస్‌ 4ను కూడా యాపిల్‌ ప్రవేశపెట్టింది. పాత వాటితో పోలిస్తే ఈ వాచ్‌ల స్క్రీన్‌ 30 శాతం పెద్దదిగా ఉంటుంది. కిందపడిపోయే అవకాశాలను కూడా ముందే గుర్తించి హెచ్చరించగలిగే చిప్‌ను పొందుపర్చారు. గుండె కొట్టుకునే వేగాన్ని లెక్కిస్తుంది. 30 సెకన్లలో ఈసీజీ  తీసుకోవచ్చు. వీటి ధర 399 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement