హైదరాబాద్‌లో డాక్‌ఆన్‌లైన్‌ సేవలు షురూ

Doc online services in Hyderabad

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌ హెల్త్‌కేర్‌ స్టార్టప్‌ డాక్‌ఆన్‌లైన్‌ హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో డాక్టర్‌ కన్సల్టేషన్, మందులు, డయోగ్నస్టిక్‌ సేవలను పొందవచ్చని కంపెనీ సీఈఓ మార్కస్‌ మొడింగ్‌ సోమవారమిక్కడ విలేకరులకు తెలిపారు. సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు కుటుంబంలో ముగ్గురు సభ్యులకు నెలకు రూ.700 ఉంటుందని... రిజిస్టర్‌ చేసుకున్న యూజర్లు నెలకు ఎన్నిసార్లయినా డాక్టర్‌ కన్సల్టేషన్, ఇతరత్రా సేవలను వినియోగించుకునే వీలుంటుందని వివరించారు.

వచ్చే ఏడాది కాలంలో దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఆ తర్వాతి ఏడాది విదేశాలకు విస్తరించాలని లకి‡్ష్యంచినట్లు చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో డాక్‌ఆన్‌లైన్‌ సేవలను పరిశీలించి.. ప్రజల నుంచి స్పందన బాగుంటే వీటిని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యులకు మళ్లించేలా చర్యలు తీసుకుంటామని’’ ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ తెలిపారు. 3 నెలల క్రితం స్వీడన్‌కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త, ఇన్వెస్టర్‌ అయిన మార్కస్‌ మొడింగ్‌ మిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో బీ2బీ విభాగంలో ఇండియాలో డాక్‌ఆన్‌లైన్‌ సేవలను ప్రారం భించారు.  కార్యక్రమంలో డాక్‌ఆన్‌లైన్‌ సీటీఓ ప్రసాద్‌ చకిలం, సీఓఓ రాహుల్‌ పేత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top