పెద్ద మొత్తంలో డిపాజిట్‌ చేశారా? అయితే... | Sakshi
Sakshi News home page

పెద్ద మొత్తంలో డిపాజిట్‌ చేశారా? అయితే...

Published Fri, Feb 9 2018 2:45 PM

Deposited 'large amount of cash' during note ban? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాత నోట్ల రద్దు తర్వాత డిపాజిట్‌ చేసిన పెద్ద మొత్తాల నగదుపై ఆదాయపు పన్ను శాఖ మరోసారి హెచ్చరికలు జారీచేసింది. నోట్ల రద్దు తర్వాత డిపాజిట్‌ చేసిన ఈ మొత్తాలతో మార్చి 31 వరకు రిటర్నులు దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ రిటర్నులు దాఖలు చేయకపోతే, జరిమానాలు, న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అర్హులైన ట్రస్ట్‌లు, రాజకీయ పార్టీలు, అసోసియేషన్లు ఈ తుది డెడ్‌లైన్‌ వరకు ఆదాయపు పన్ను రిటర్నలు దాఖలు చేసి, క్లీన్‌చీట్‌ పొందాలని పేర్కొంది. ప్రముఖ దినపత్రికల్లో ప్రజా ప్రకటనల ద్వారా ఆదాయపు పన్ను శాఖ ఈ ఆదేశాలను జారీచేసింది. 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు గాను ఐటీఆర్‌లను సమీక్షించుకోవడానికి, పెండింగ్‌లో ఉన్న రిటర్నులు దాఖలు చేయడానికి ఇదే తుది ఆదేశంగా పేర్కొంది.

ఒకవేళ మీరు బ్యాంకు అకౌంట్‌లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్‌ చేస్తే.. ఐటీఆర్‌లను ఫైల్‌ చేయాలని, లేదంటే పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుందని పబ్లిక్‌ అడ్వయిజరీ కూడా హెచ్చరించింది.  అన్ని కంపెనీలు, సంస్థలు, బాధ్యతాయుత భాగస్వామ్య సంస్థలు, ట్రస్టులు, అసోసియేషన్లు, రాజకీయ పార్టీలు ఎవరూ కూడా దీనికి మినహాయింపు కాదని, అందరికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. రూ.2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఆదాయమున్న వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు, రూ.3 లక్షలకు పైన, రూ.5 లక్షలకు పైన ఉన్నఆదాయమున్న సీనియర్‌ సిటిజన్లందరూ ఈ ఆర్థిక సంవత్సరాలకు గాను రిటర్నులు దాఖలు చేయాలని ప్రకటించింది.    

Advertisement
Advertisement