బిగ్‌ ‘సి’ దసరావళి తొలి డ్రా

Dasarawali Double Damaka by Big C - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ బిగ్‌ ‘సి’ దసరావళి తొలి లక్కీ డ్రా విజేతలను ప్రకటించింది. సంస్థ ఫౌండర్‌ ఎం.బాలు చౌదరి, డైరెక్టర్లు స్వప్న కుమార్, బాలాజీ రెడ్డి ఈ వివరాలను బుధవారం వెల్లడించారు. మొత్తం 20 మందిని లక్కీ డ్రాలో ఎంపిక చేశారు. వీరిలో 10 మందికి మారుతీ ఆల్టో 800 కార్లు, 10 మందికి బజాజ్‌ ప్లాటినా బైక్‌లను బహుమతిగా అందిస్తారు. అక్టోబరు 29 వరకు ఉండే ఈ ఆఫర్‌ కింద మొత్తం 30 మారుతి ఆల్టో కార్లు, 30 బజాజ్‌ ప్లాటినా బైక్‌లను కస్టమర్లు గెలుచుకోవచ్చు. అలాగే 10% హెచ్‌డీఎఫ్‌సీ క్యాష్‌ బ్యాక్, సులభ వాయిదాల్లో మొబైల్‌ కొన్నవారికి ఒక ఈఎంఐ ఉచితం, 30% పేటీఎం క్యాష్‌బ్యాక్‌ అందుకోవచ్చు. ప్రతి మొబైల్‌ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top