ఘనంగా మైసూరు దసరా.. ప్రారంభించిన బుకర్‌ ప్రైజ్‌ విజేత బాను ముష్తాక్‌ | Banu Mushtaq Booker Prize Winner Inaugurates Mysuru Dasara | Sakshi
Sakshi News home page

ఘనంగా మైసూరు దసరా.. ప్రారంభించిన బుకర్‌ ప్రైజ్‌ విజేత బాను ముష్తాక్‌

Sep 22 2025 12:32 PM | Updated on Sep 22 2025 12:45 PM

Banu Mushtaq Booker Prize Winner Inaugurates Mysuru Dasara

మైసూరు: కర్ణాటకలోని మైసూరులో ఈరోజు(సోమవారం) అత్యంత వేడుకగా దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్‌ గ్రహీత రచయిత్రి బాను ముష్తాక్ నవరాత్రుల తొలిరోజున మైసూరు దసరా ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. దసరా ఉత్సవాల ప్రారంభాన్ని సూచిస్తూ,  చాముండి కొండలపై కొలువైన చాముండేశ్వరి ఆలయ ప్రాంగణంలో పూజారులు వేద మంత్ర పఠనాల మధ్య అమ్మవారి విగ్రహంపై పూల వర్షం కురిపించారు.
 

ప్రసిద్ధ మైసూరు దసరా ఉత్సవం సంప్రదాయ  వేడుకల నడుమ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పలువురు రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సారి మైసూరు దసరా వేడుకల ప్రారంభానికి రచయిత బాను ముష్తాక్‌ను ఆహ్వానించాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు బీజేపీ నేతలు, వామపక్ష నేతలు వ్యతిరేకించారు. దీనికి సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీనిలో బాను ముష్తాక్‌.. కన్నడ భాషను,  అమ్మవారిని భువనేశ్వరిగా పూజించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఉంది.

ఈ నేపధ్యంలో దసరా ఉత్సవాలను ప్రారంభించే ముందు బాను.. చాముండేశ్వరి దేవతపై ఆమెకున్న వైఖరిని స్పష్టం చేయాలని పలువురు బీజేపీ నేతలు  కోరారు. అయితే బాను ముష్తాక్ దీనికి సమాధానమిస్తూ.. తన పాత ప్రసంగంలోని కొన్ని భాగాలను సోషల్ మీడియాలో వైరల్ చేసి, తన మాటలను వక్రీకరించారని ఆరోపించారు. మరోవైపు  బాను ముష్తాక్‌ను  మైసూర్ దసరా వేడుకల ప్రారంభానికి కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను  సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement