త్రైమాసిక ఫలితాల వాయిదాకు అనుమతినివ్వండి: సెబీని కోరిన కంపెనీలు

Companies seek Sebi approval to defer or merge Q1 results - Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక ఫలితాలను వాయిదా వేయడానికి లేదా సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల్లో విలీనం చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ లిస్టెడ్‌ కంపెనీలు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీని కోరాయి. 

కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధింపుతో ఏప్రిల్‌-మే మధ్యకాలంలో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడం, అమ్మకాలు క్షీణించడంతో విస్తృతమైన భారీ నష్టాలను నమోదు కావచ్చని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే లాక్‌డౌన్‌ తరువాత స్టాక్ ధరలు భారీగా క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రిఫరెన్షియల్ ఈక్విటీ ఆఫర్, ఓపెన్ ఆఫర్‌లపై నిబంధనలను సడలించాలని కొన్ని ప్రముఖ కంపెనీలు సంస్థలు సెబీని కోరాయి. 

త్రైమాసికాల్లో నమోదయ్యే భారీ నష్టాలు కంపెనీల నికర విలువను..,  రుణాలు తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తాయడంతో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత పరిస్థితి ఇంతకు ముందెన్నడూ జరగనిది. అయితే పారదర్శకత, కార్పొరేట్ పాలన ప్రమాణాలకు వ్యతిరేకంగా కంపెనీల ప్రతిపాదనను సెబీ పరిశీలించాల్సి ఉంటుందని సీనియయర్‌ ఛార్టెర్‌ అకౌంటెండ్‌ దిలీప్ లఖాని తెలిపారు. 

స్టాక్‌ మార్కెట్లో లిస్టైన ప్రతి కంపెనీ త్రైమాసికం ముగిసిన 45 రోజుల్లోగా తమ ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే కంపెనీల ప్రతిపాదనపై సెబీ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top