listed companies
-
లిస్టెడ్ కంపెనీల్లో అంతా మిస్టర్‌లేనా!
కంపెనీల సిబ్బందిలో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా లిస్టెడ్ సంస్థల్లో వారి వాటా అంతంత మాత్రంగానే ఉంటోంది. ఎన్ఎస్ఈలో లిస్టయిన దాదాపు సగం కంపెనీల్లో (52 శాతం) ఉద్యోగినుల సంఖ్య 10 శాతం లోపే ఉంది. స్వచ్ఛంద సంస్థ ఉదైతీ విడుదల చేసిన ’సీజీజీ డ్యాష్‌బోర్డ్ 2024–25’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.ఎన్ఎస్ఈలో లిస్టయిన 1,386 కంపెనీల బాధ్యతాయుత వ్యాపారం, పర్యావరణహిత కార్యకలాపాల నివేదికలు (బీఆర్ఎస్ఆర్), సంస్థల వార్షిక నివేదికల ఆధారంగా ఈ రిపోర్ట్ రూపొందింది. వివిధ రంగాలవ్యాప్తంగా మహిళలు .. పురుషుల ప్రాతినిధ్యం, జీతాల్లో అంతరాలు, నాయకత్వ స్థానాల్లో సమ్మిళితత్వం, అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) తదితర అంశాలను ఇందులో పరిశీలించారు.‘సిబ్బందిలో మహిళల ప్రాతినిధ్యం గత అయిదేళ్లుగా స్థిరంగా పెరుగుతోంది. అయినప్పటికీ ఈ ఏడాది గణాంకాలు చూస్తుంటే అది అంత వేగంగా పెరగడం లేదని తెలుస్తంది. ఎన్ఎస్ఈలో లిస్టయిన 2,615 సంస్థల్లో కేవలం సగం మాత్రమే లింగ ప్రాతినిధ్య డేటాను ఇస్తున్నాయి కాబట్టి మన ముందు ప్రస్తుతం ఉన్నది పాక్షిక ముఖ చిత్రమే‘ అని ఉదైతీ వ్యవస్థాపక సీఈవో పూజా శర్మ గోయల్ తెలిపారు. రిపోర్ట్‌లో మరిన్ని విశేషాలు.. మొత్తం ఉద్యోగుల సంఖ్య 6 శాతం పెరగ్గా, మహిళా ఉద్యోగుల సంఖ్య 7 శాతం పెరిగింది. మరింత మంది మహిళలు ఉద్యోగాల్లో చేరుతున్నప్పటికీ నిర్దేశిత లక్ష్యాల స్థాయిలో వారి వాటా పెరగడం లేదు. ఆసుపత్రులు, ప్రయోగశాలల్లో మహిళల ప్రాతినిధ్యం 45 శాతం నుంచి 48 శాతానికి, వినియోగదారుల సర్వీసుల్లో 30 % నుంచి 34 శాతానికి పెరగ్గా, ఐటీ (34 శాతం), బ్యాంకింగ్ (26 శాతం)లో పెద్దగా మార్పు నమోదు కాలేదు. మహిళలు, పురషుల జీతాల మధ్య వ్యత్యాసం 2024, 2025 ఆర్థిక సంవత్సరాల్లో 6.7 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గింది. అయితే, మహిళల ప్రాతినిధ్యం ఎక్కువే ఉన్నప్పటికీ టెక్స్టైల్స్ (30.4 శాతం), డైవర్సిఫైడ్ (28.5 శాతం), మెటల్స్ .. మైనింగ్ (17 శాతం)లో మాత్రం వ్యత్యాసరం ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు పురుషాధిక్యం ఎక్కువగా ఉండే కొన్ని రంగాల్లో జీతాల మధ్య వ్యత్యాసం రివర్స్‌లో ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఆర్జిస్తున్న రంగాల్లో ఫార్మా (8 శాతం), కన్జూమర్ డ్యూరబుల్స్ (7 శాతం) ఉన్నాయి. లైంగిక వేధింపుల నివారణ నిబంధనలు (పీవోఎస్‌హెచ్) గురించి అవగాహన పెరుగుతోంది. పని ప్రదేశాల్లో సహోద్యోగుల తప్పుడు ప్రవర్తనపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకొస్తున్నారు. లైంగిక వేధింపు ఫిర్యాదులు 16 శాతం పెరగడం ఇందుకు నిదర్శనం. అయితే, ఫిర్యాదుల స్థాయిలో పరిష్కారాల వేగం ఉండటం లేదు. పెండింగ్ కేసులు 28 శాతం దీన్ని సూచిస్తంది. ఈ నేపథ్యంలో భద్రత, సమాన అవకాశాలు, వర్క్‌ప్లేస్ డిజైన్ విషయాల్లో వ్యవస్థాగతంగా ఉన్న అవరోధాలను అధిగమించే దిశగా ఇటీవలి లేబర్ కోడ్ ముందడుగులాంటిది. వీటిని మార్చుకోగలిగి, స్మార్ట్ విధానాలను అమలు చేస్తే, ప్రభుత్వం..కంపెనీలు చొరవ చూపితే మరింత మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాల్లో పాలుపంచుకునే ప్రక్రియ వేగవంతం అవుతుంది. -
డివిడెండ్ ధమాకా!
లిస్టెడ్ కంపెనీలు దేశీయంగా వాటాదారులకు గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ. 5 లక్షల కోట్లు డివిడెండ్‌గా చెల్లించాయి. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. వార్షికంగా ఇది 11 శాతం అధికం! అయితే గత ఐదేళ్లలో లేనివిధంగా గతేడాది వాటాదారులకు చెల్లింపులు నెమ్మదించడం గమనార్హం! – సాక్షి, బిజినెస్ డెస్క్ ప్రపంచవ్యాప్త అనిశ్చితులు, మందగమన పరిస్థితుల మధ్య గతేడాది లిస్టెడ్ కార్పొరేట్ సంస్థల ఆదాయం, నికర లాభాలు మందగించాయి. అయినప్పటికీ వాటాదారులకు డివిడెండ్ రూపేణా లాభాల్లో వాటాను పంచడంలో సరికొత్త రికార్డ్ నమోదైంది. లిస్టెడ్ కంపెనీలు ఉమ్మడిగా గతేడాది రూ. 5 ట్రిలియన్లు డివిడెండ్‌గా చెల్లించాయి. అంతక్రితం ఏడాది (2023–24)లో వాటాదారులు అందుకున్న డివిడెండ్ రూ. 4.52 లక్షల కోట్లే. గతేడాది దేశీ లిస్టెడ్ కంపెనీల నికర లాభం(నష్టాలు, అనుకోని లాభాలను సర్దుబాటు చేశాక) 5 శాతం పైగా ఎగసి రూ. 16 లక్షల కోట్లను తాకాయి.అంతక్రితం ఏడాది రూ. 15.21 ట్రిలియన్లుగా నమోదైంది. బీఎస్ఈలో లిస్టయిన 1,218 ప్రధాన కంపెనీలను పరిగణనలోకి తీసుకున్న గణాంకాలివి! గతేడాది ఉమ్మడిగా నికర అమ్మకాలు (ఫైనాన్షియల్ సంస్థలైతే వడ్డీ ఆదాయం) 7.5% పుంజుకుని రూ.166.4 ట్రిలియన్లకు చేరాయి. అంతక్రితం ఇవి రూ.154.83 లక్షల కోట్లు. బైబ్యాక్‌ల వెనకడుగు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)లో గతేడాది నామమాత్ర(1.2 శాతం) వృద్ధి మాత్రమే నమోదైంది. బైబ్యాక్‌లతో కలిపి వాటాదారులకు కంపెనీలు రూ. 5.08 ట్రిలియన్లు చెల్లించాయి. అంతక్రితం ఏడాదిలో ఇది రూ. 5.03 లక్షల కోట్లుకాగా.. గతేడాది షేర్ల బైబ్యాక్‌పై లిస్టెడ్ కంపెనీలు రూ. 8,034 కోట్లు వెచ్చించాయి. బైబ్యాక్‌లు తగ్గడంతో వార్షికంగా చెల్లింపుల నిష్పత్తి 33 శాతం నుంచి 32 శాతానికి క్షీణించింది.అయితే గత దశాబ్ద కాలాన్ని పరిగణిస్తే లిస్టెడ్ కంపెనీలు బైబ్యాక్‌లు, డివిడెండ్లపై వార్షిక నికర లాభాల్లో 40 శాతం వరకూ వాటాదారులకు చెల్లించాయి. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు బైబ్యాక్లపై నగదు వెచ్చింపును తగ్గించడం ఇటీవల ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క ఇతర రంగాలలోని కంపెనీలు విస్తరణ కోసం నగదును కేటాయించడంతో ఇటీవల డివిడెండ్ల చెల్లింపులపై ప్రతికూల ప్రభావం పడినట్లు తెలియజేశారు.లాభాలు ఓకే గత రెండేళ్లలో డివిడెండ్ చెల్లింపులు 7 శాతానికి పరిమితమైనప్పటికీ కంపెనీల లాభాల్లో 16 శాతం పురోగతి నమోదైనట్లు విశ్లేషకులు తెలియజేశారు. గతేడాది షేర్ల బైబ్యాక్‌పై లిస్టెడ్ కంపెనీలు గత 9ఏళ్లలోనే కనిష్టంగా నిధులు వెచ్చించినట్లు వెల్లడించారు. 2017–18లో అత్యధికంగా 22% నగదును బైబ్యాక్‌కు కేటాయించాయి. 2024–25లో ఇది 1.6 శాతానికి పరిమితమైంది.దిగ్గజాల తీరిలా గరిష్ట డివిడెండ్లు చెల్లించే లిస్టెడ్ దిగ్గజాలలో టాటా గ్రూప్ సంస్థ టీసీఎస్ గతేడాది 73 శాతం అధికంగా రూ. 45,612 కోట్ల డివిడెండ్ చెల్లించింది. దీంతో వరుసగా రెండో ఏడాది(2024–25)లోనూ టాప్‌చెయిర్‌ను అలంకరించింది. అయితే బైబ్యాక్‌కు నో చెప్పింది. ఈ బాటలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ రూ. 17,958 కోట్లు, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ. 17,828 కోట్లు వెచ్చించాయి. టాప్–10 జాబితాలో రూ. 17,009 కోట్లతో వేదాంతా, రూ.16,835 కోట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రూ.16,331 కోట్లతో పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా, రూ.16,290 కోట్లతో హెచ్‌సీఎల్ టెక్, రూ.15,411 కోట్లతో ఓఎన్జీసీ, రూ.14,190 కోట్లతో ఎస్బీఐ, రూ.12,455 కోట్లతో హెచ్‌యూఎల్ నిలిచాయి. వెరసి టాప్–10 కంపెనీలు ఉమ్మడిగా రూ. 1.9 లక్షల కోట్లు డివిడెండ్‌గా చెల్లించాయి. -
టాప్-100 కంపెనీలకు డిజిటల్ అష్యూరెన్స్: సెబీ
టాప్-100 లిస్టెడ్ కంపెనీలకు ఆర్థిక నివేదికలకు సంబంధించి తప్పనిసరి డిజిటల్ అష్యూరెన్స్‌ను సెబీ ప్రతిపాదించింది. కంపెనీల ఆర్థిక నివేదికలను మదింపు చేసే ఆడిటర్లు, ఆయా కంపెనీల డిజిటల్ సమాచార మూలాలను కూడా ధ్రువీకరించనుండడం ఇందులో భాగంగా ఉంటుంది. దీనిపై సంప్రదింపుల పత్రాన్ని సెబీ (SEBI) విడుదల చేసింది.‘‘డిజిటల్ అష్యూరెన్స్ రిపోర్ట్‌తో పారదర్శకత పెరుగుతుంది. సమాచార వెల్లడి ప్రమాణాలు మెరుగుపడతాయి. తద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు మరింత రక్షణ లభించి, వ్యవస్థ పట్ల నమ్మకం పెరుగుతుంది’’అని సెబీ పేర్కొంది. కంపెనీ ఆర్థిక నివేదికలను మదింపు చేసే ఆడిటర్లే ఈ డిజిటల్ అష్యూరెన్స్ నివేదికలను ప్రత్యేకంగా జారీ చేయాల్సి ఉంటుంది.దీనికి సహకారం అందించేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కూడా ముందుకు వచ్చింది. డిజిటల్‌గా అందుబాటులో ఉన్న ఆడిట్ ఆధారాలు, సమాచారాన్ని ఉపయోగించడం ద్వారా ఆడిట్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి తమ సభ్యులకు మార్గదర్శకత్వం అందించడానికి డిజిటల్ హామీపై ఒక మార్గదర్శనాన్ని విడుదల చేసింది. -
ప్రమోటర్లు వాటాలు అమ్మేస్తున్నారు!
ఇటీవల సెకండరీ మార్కెట్లు బుల్ వేవ్‌లో పరిగెడుతున్నాయి. తాజాగా సెన్సెక్స్ 79,000, నిఫ్టీ 24,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించాయి. తద్వారా ప్రామాణిక ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను సాధించాయి. ఈ నేపథ్యంలో పలు లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు కొంతమేర సొంత వాటాలను విక్రయించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇందుకు పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయి. వివరాలు చూద్దాం..ముంబై: రోజుకో చరిత్రాత్మక గరిష్టాన్ని తాకుతూ దౌడు తీస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు సైతం కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. దీంతో కొన్ని కంపెనీల ప్రమోటర్లు ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా తమ వాటాలో కొంతమేర విక్రయిస్తున్నారు. తద్వారా నిధులను సమకూర్చుకుంటున్నారు. వీటిని రుణ చెల్లింపులు, విస్తరణ ప్రణాళికలు, పబ్లిక్కు కనీస వాటా తదితరాలకు వినియోగిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వివరాల ప్రకారం 2024 తొలి ఆరు నెలల్లోనే ఎన్ఎస్ఈ–500లోని కొన్ని కంపెనీల ప్రమోటర్లు 10.5 బిలియన్ డాలర్ల(రూ. 87,000 కోట్లకుపైగా) విలువైన ఈక్విటీలను విక్రయించారు. మరొక విశ్లేషణ ప్రకారం గత రెండు నెలల్లోనే సుమారు 200 లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు రూ. 33,000 కోట్లకుపైగా విలువైన షేర్లను విక్రయించడం తాజా ట్రెండ్‌కు అద్దం పడుతోంది. వెరసి దేశీ ఈక్విటీల విలువలు అత్యంత ప్రీమియంస్థాయికి చేరాయన్న సంకేతాలు వెలువడుతున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇందువల్లనే కొన్ని లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు తమతమ బిజినెస్‌లలో లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారని విశ్లేíÙంచారు. కరోనా ఎఫెక్ట్...ప్రస్తుత మార్కెట్లలో పలు కంపెనీల షేర్లు గరిష్ట విలువలకు చేరడంతో బ్లాక్ డీల్స్ లేదా బల్క్ డీల్స్ ద్వారా ప్రమోటర్లు కొంతమేర వాటాలను అమ్మివేస్తున్నారు. వీరికితోడు ఇటీవల పీఈ దిగ్గజాలు, ఇతర సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం తమ పెట్టుబడులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుత ట్రెండ్ కారణంగా 2023 జనవరి–డిసెంబర్లో నమోదైన 12.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,04,000 కోట్లు) విక్రయ రికార్డ్ 2024 కేలండర్ ఏడాదిలో తుడిచిపెట్టుకుపోయే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.2023లో అదానీ గ్రూప్ ప్రమోటర్లు వాటాలు విక్రయించిన విషయం విదితమే. 2024లో ఇప్పటివరకూ దేశ, విదేశీ ప్రమోటర్లు మొత్తంగా రూ. 87,000 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. కోవిడ్–19 నేపథ్యంలో 2020 జనవరి–డిసెంబర్‌లోనూ రికార్డు నెలకొల్పుతూ రూ. 78,500 కోట్ల విలువైన షేర్లను వివిధ కంపెనీల ప్రమోటర్లు అమ్మివేశారు.జూన్‌లో పలువురు ప్రమోటర్లు బ్లాక్ డీల్స్ ద్వారా భారీగా వాటాలను విక్రయించారు. రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలతో ఇండస్ టవర్స్‌లో యూకే దిగ్గజం వొడాఫోన్ గ్రూప్ 18 % వాటాను విక్రయించింది. ఇక ఎంఫసిస్‌లో 15% వాటాను పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ 80 కోట్ల డాలర్లకు అమ్మింది. దేశీ మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌లో ప్రమోటర్ వేదాంతా రిసోర్సెస్ 2.63% వాటా విక్రయం ద్వారా రూ. 4,184 కోట్లు సమీకరించింది. ఇక జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్లో వాబ్కో ఏషియా 30 కోట్ల డాలర్ల విలువైన వాటాను విక్రయించింది.విక్రయ తీరు(రూ. కోట్లలో)కంపెనీ పేరు షేర్ల విలువ ఇండస్ టవర్స్ 15,300 ఎంఫసిస్ 6,680 వేదాంతా 4,184 ఇంటర్‌గ్లోబ్ 3,300 జెడ్ఎఫ్ సీవీ 2,194 గ్లాండ్ ఫార్మా 1,754 -
లాభాలు ఓకే.. డివిడెండ్లు ప్చ్!
దేశీయంగా లిస్టెడ్ కంపెనీలు మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో సగటున రికార్డ్ స్థాయిలో లాభాలు ఆర్జించాయి. అయితే లాభాలను వాటాదారులకు పంచే(డివిడెండ్ పేఔట్) విషయంలో వెనుకంజ వేస్తున్నాయి. వార్షికంగా పేఔట్ దాదాపు 5 శాతం నీరసించింది. ఇందుకు పలు అంశాలు ప్రభావాన్ని చూపుతున్నాయి. డివిడెండ్ ప్రకటించిన 999 లిస్టెడ్ కంపెనీలను పరిగణించిన ఒక నివేదిక రూపొందించిన వివరాలు చూద్దాం.. ముంబై: దేశీ లిస్టెడ్ కార్పొరేట్లు గతేడాది(2023–24)కి డివిడెండ్లను ప్రకటించడంలో ఆచితూచి అడుగేస్తున్నాయి. దీంతో సగటున అంతక్రితం ఏడాది(2022–23)తో పోలిస్తే డివిడెండ్ చెల్లింపు 4.7 శాతం తగ్గింది. రూ. 4.03 లక్షల కోట్లను పంచిపెట్టాయి. అయితే 2022–23లో సరికొత్త రికార్డును లిఖిస్తూ చెల్లించిన రూ. 4.23 ట్రిలియన్లతో పోలిస్తే తక్కువే. ఇక నికర లాభాల విషయానికివస్తే(అనుకోని లాభాలు లేదా నష్టాల సర్దుబాటు తదుపరి) గతేడాది వార్షికంగా 30 శాతం వృద్ధితో రూ. 14.75 లక్షల కోట్లను ఆర్జించాయి. ఇవి చరిత్రాత్మక గరిష్టంకాగా.. 2022–23లో రూ. 11.36 ట్రిలియన్ నికర లాభాన్ని సాధించాయి. కరోనా మహమ్మారి తదుపరి గత మూడేళ్లుగా దేశీ కార్పొరేట్ లాభాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతూ వస్తున్నాయి. దీంతో డివిడెండ్ చెల్లింపులు సైతం 2020–23 కాలంలో వార్షిక పద్ధతిన 29.5 శాతం చొప్పున ఎగశాయి. వార్షిక చెల్లింపులు 2023కల్లా 4.23 లక్షల కోట్లకు జంప్‌చేసింది. 2020లో ఇవి రూ. 1.95 ట్రిలియన్లు మాత్రమే. ఇదే కాలంలో మొత్తం లిస్టెడ్ కంపెనీల నికర లాభం దాదాపు 34 శాతం దూసుకెళ్లాయి. అయినప్పటికీ గతేడాది లాభాల పంపకం డీలా పడటం గమనార్హం! కోవిడ్–19 ముందు.. గత మూడేళ్లతో పోలిస్తే ఈక్విటీ డివిడెండ్ల చెల్లింపులు కోవిడ్–19కు ముందు తక్కువగానే నమోదయ్యాయి. 2017–20 కాలంలో లిస్టెడ్ కంపెనీల ఈక్విటీ డివిడెండ్ల పంపకం వార్షికంగా కేవలం 3 శా తం వృద్ధిని అందుకుంది. దీంతో 2017లో నమోదైన రూ. 1.78 ట్రిలియన్ డివిడెండ్లు 2020కల్లా రూ. 1.95 లక్షల కోట్లకు మాత్రమే బలపడ్డాయి. ఇందుకు నికర లాభాలు నీరసించడం కారణమైంది. 2017లో మొత్తం లిస్టెడ్ కంపెనీల నికర లాభం రూ. 4.81 లక్షల కోట్లుకాగా.. 2020కల్లా రూ. 4.75 ట్రిలియన్లకు పరిమితమైంది. కాగా.. ప్రస్తుతానికి వస్తే గత ఐదేళ్లలో తొలిసారి వార్షికంగా డివిడెండ్ పేఔట్ రేషియో గతేడాది తగ్గింది. ఇలా ఇంతక్రితం 2019 లోనూ పేఔట్లో క్షీణత నమోదైంది. 2018లో రూ. 1.87 లక్షల కోట్లుకాస్తా 2019లో రూ.1.85 ట్రిలియ న్లకు బలహీనపడింది. ఇక గతేడాది లాభాలు, డివిడెండ్లు వ్యతిరేక దిశలో నమోదయ్యాయి. గత 9 ఏళ్లలోనే కనిష్టంగా డివిడెండ్ పేఔట్ నిష్పత్తి 27 శాతానికి పరిమితమైంది. 2023లో ఇది 37 శాతంకాగా.. 2020లో ఆల్‌టైమ్ గరిష్టం 41 శాతాన్ని తాకింది. కారణాలు.. సగటున పేఔట్ రేషియో నీరసించడానికి మార్కెట్ విశ్లేషకులు కొన్ని కారణాలను ప్రస్తావిస్తున్నారు. గతేడాది కొన్ని కీలక రంగాలలో కార్పొరేట్ ఆర్జన మందగించింది. దీంతో కొన్ని కంపెనీలు నగదును అంతర్గత వనరుల కోసం పక్కన పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. పీఎస్‌యూ బ్యాంకులు, చమురు కంపెనీలు అధిక లాభాలను ఆర్జించగా.. అధిక డివిడెండ్లు పంచే ఐటీ, ఎఫ్ఎంసీజీ తదితర రంగాలలో డిమాండ్ మందగించడం, వినియోగ వ్యయాలు తగ్గడం ప్రభావం చూపినట్లు వివరించారు. -
రియల్టీ బుకింగ్స్ జోరు
న్యూఢిల్లీ: రియల్టీ రంగ దిగ్గజాలు ప్రాపరీ్టల అమ్మకాలలో గత ఆర్థిక సంవత్సరం(2023–24) స్పీడందుకున్నాయి. 18 లిస్టెడ్ కంపెనీలు మొత్తం రూ. 1.17 లక్షల కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించాయి. ఈ జాబితాలో గోద్రెజ్ ప్రాపరీ్టస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, డీఎల్ఎఫ్, మాక్రోటెక్ డెవలపర్స్, సిగ్నేచర్ గ్లోబల్ తదితరాలు అగ్రపథంలో నిలిచాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ. 25,527 కోట్ల విలువైన అమ్మకాల బుకింగ్స్ సాధించి తొలి స్థానాన్ని పొందింది. అంతక్రితం ఏడాది(2022–23)తో పోలిస్తే కొద్దిపాటి కంపెనీలను మినహాయిస్తే ప్రధాన సంస్థలన్నీ అమ్మకాల బుకింగ్స్‌లో జోరు చూపాయి. ఇందుకు ప్రధానంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు పుట్టిన పటిష్ట డిమాండ్ కారణమైంది. ప్రధాన నగరాలలో ప్రత్యేకంగా విలాసవంత గృహాలకు భారీ డిమాండ్ కనిపించడం తోడ్పాటునిచి్చంది! శోభా, బ్రిగేడ్, పుర్వంకారా.. రియల్టీ రంగ లిస్టెడ్ దిగ్గజాలలో గతేడాది ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రూ. 21,040 కోట్ల అమ్మకాల బుకింగ్స్‌తో రెండో ర్యాంకులో నిలిచింది. ఇక డీఎల్ఎఫ్ రూ. 14,778 కోట్లు, లోధా బ్రాండ్ మాక్రోటెక్ రూ. 14,520 కోట్లు, గురుగ్రామ్ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్ రూ. 7,270 కోట్లు చొప్పున ప్రీసేల్స్ సాధించి తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఈ బాటలో బెంగళూరు సంస్థ శోభా లిమిటెడ్ రూ. 6,644 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ. 6,013 కోట్లు, పుర్వంకారా రూ. 5,914 కోట్లు, ముంబై కంపెనీ ఒబెరాయ్ రియల్టీ రూ. 4,007 కోట్లు, కోల్టే పాటిల్ రూ. 2,822 కోట్లు, మహీంద్రా లైఫ్సై్పస్ రూ. 2,328 కోట్లు, కీస్టోన్ రియల్టర్స్ రూ. 2,266 కోట్లు, సన్‌టెక్ రియల్టీ రూ. 1,915 కోట్లు చొప్పున అమ్మకాల బుకింగ్స్ నమోదు చేశాయి. ఇదేవిధంగా ఏషియానా హౌసింగ్ రూ. 1,798 కోట్లు, అరవింద్ స్మార్ట్‌స్పేసెస్ రూ. 1,107 కోట్లు, అజ్మీరా రియల్టీ అండ్ ఇన్ఫ్రా రూ. 1,017 కోట్లు, ఎల్డెకో హౌసింగ్ రూ. 388 కోట్లు, ఇండియాబుల్స్ రియల్టీ రూ. 280 కోట్లు చొప్పున బుకింగ్స్ అందుకున్నాయి. అయితే ఒమాక్సే తదితర కొన్ని కంపెనీల వివరాలు వెల్లడికావలసి ఉంది. ఇతర దిగ్గజాలు.. ఇతర దిగ్గజాలలో టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రా, అదానీ రియలీ్ట, పిరమల్ రియల్టీ, హీరానందానీ గ్రూప్, ఎంబసీ గ్రూప్, కే రహేజా గ్రూప్ తదితరాలు నాన్‌లిస్టెడ్ కంపెనీలుకావడంతో త్రైమాసిక, వార్షిక బుకింగ్స్ వివరాలు వెల్లడించని సంగతి తెలిసిందే. కాగా.. కోవిడ్–19 తదుపరి సొంత ఇంటికి ప్రాధాన్యత పెరగడంతో హౌసింగ్ రంగం ఊపందుకున్నట్లు రియల్టీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పటిష్టస్థాయిలో ప్రాజెక్టులను పూర్తిచేసే కంపెనీల ప్రాపరీ్టలకు డిమాండు పెరిగినట్లు తెలియజేశారు. వెరసి బ్రాండెడ్ గృహాలవైపు కన్జూమర్ చూపుసారించడం లిస్టెడ్ కంపెనీలకు కలసి వస్తున్నట్లు తెలియజేశారు. గతంలో యూనిటెక్, జేపీ ఇన్ఫ్రాటెక్ తదితరాల హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తికాకపోగా.. విఫలంకావడంతో గృహ కొనుగోలుదారులు ధర అధికమైనా రిస్‌్కలేని వెంచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.33 శాతం వృద్ధిబలమైన కన్జూమర్ డిమాండ్ నేపథ్యంలో గతేడాది దేశీ రియల్టీ రంగంలో రికార్డ్ ప్రీసేల్స్ నమోదయ్యాయి. ఆయా కంపెనీల సమాచారం ప్రకారం లిస్టెడ్ రియల్టీ కంపెనీలు ఉమ్మడిగా రూ. 1,16,635 కోట్ల సేల్స్ బుకింగ్స్‌ను సాధించాయి. 2022–23లో నమోదైన రూ. 88,000 కోట్ల బుకింగ్స్‌తో పోలిస్తే ఇది 33 శాతం అధికం. జాబితాలో శోభా, బ్రిగేడ్, పుర్వంకారా, ఒబెరాయ్ రియలీ్ట, మహీంద్రా లైఫ్‌స్పేస్, కోల్టేపాటిల్, సన్‌టెక్, కీస్టోన్ రియల్టర్స్ తదితరాలు చేరాయి. పటిష్ట బ్రాండ్ గుర్తింపు, డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో, పెట్టుబడుల సులభ సమీకరణ కారణంగా లిస్టెడ్ రియల్టీ కంపెనీలు ఆకర్షణీయ పనితీరు చూపగలుగుతున్నట్లు హౌసింగ్.కామ్, ప్రాప్‌టైగర్ సీఈవో ధ్రువ్ అగర్వాల్ పేర్కొన్నారు. దీనికితోడు ఆధునిక టెక్నాలజీలతో మార్కెటింగ్, అమ్మకాలు చేపట్టడం, మెరుగైన కస్టమర్ సరీ్వసులు తదితరాల ద్వారా మార్కెట్ వాటాను కైవసం చేసుకుంటున్నట్లు తెలియజేశారు. వెరసి నాన్‌లిస్టెడ్ లేదా చిన్న కంపెనీలకంటే పైచేయి సాధించగలుగుతున్నట్లు వివరించారు. -
ఆరు సంస్థలుగా వేదాంతా
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ బిజినెస్‌ల విడదీతకు రుణదాతలు ఆమోదముద్ర వేశారు. దీంతో ఆరు స్వతంత్ర లిస్టెడ్ కంపెనీలుగా ఆవిర్భవించేందుకు వేదాంతాకు వీలు చిక్కనుంది. ఎస్బీఐసహా రుణదాతలు అంగీకరించడంతో 52 శాతానికిపైగా అను మతి లభించినట్లేనని వేదాంతా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు. అధిక శాతం రుణదాతలు విడదీతను సమరి్ధంచినట్లు వెల్లడించారు. విడదీత ప్రణాళికకు 75% ఆమోదం లభించవలసి ఉండగా.. వారం, పది రోజుల్లో మిగిలిన లక్ష్యాన్ని సైతం చేరుకోగలమని తెలియజేశారు. కొన్ని అనుమతులకు కమిటీ మీటింగ్, బోర్డు సమావేశాల కోసం చూస్తున్నట్లు తెలియజేశారు. వీటి తదుపరి ఎన్సీఎల్టీకి దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రధాన రుణదాత ఎస్బీఐ ఇప్పటికే సమ్మతించగా.. 20 బిలియన్ డాలర్ల విలువైన విడదీత ప్రణాళికకు దారి ఏర్పడినట్లు వివరించారు. గత జనవరి–మార్చిలో రూ. 6,155 కోట్ల నికర రుణభారాన్ని తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో రుణ భారం రూ. 56,388 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. వేదాంతా రుణదాతల జాబితాలో ఎస్బీఐ, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఐవోబీ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతోపాటు.. ప్రయివేట్ బ్యాంకులైన యస్ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఐడీఎఫ్సీ ఫస్ట్, కొటక్ మహీంద్రా ఉన్నాయి. విడదీతలో భాగంగా వేదాంతా.. అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్, స్టీల్, ఫెర్రస్ మెటీరియల్స్, బేస్ మెటల్స్ సంస్థలుగా ఏర్పాటు కానుంది. ఇవన్నీ స్వతంత్ర కంపెనీలుగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నాయి -
ఫండ్స్ పెట్టుబడుల జోరు..
ముంబై: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) పెట్టుబడులు చరిత్రాత్మక గరిష్టానికి చేరాయి. మార్చితో ముగిసిన గతేడాది(2023–24) చివరి త్రైమాసికంలో లిస్టెడ్ కంపెనీలలో ఎంఎఫ్‌ల వాటా 9 శాతానికి ఎగసింది. ఇందుకు ఈ కాలంలో తరలివచి్చన రూ. 81,539 కోట్ల నికర పెట్టుబడులు దోహదపడ్డాయి. ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ వివరాల ప్రకారం 2023 డిసెంబర్ చివరికల్లా ఈ వాటా 8.8 శాతంగా నమోదైంది. ఈ కాలంలో దేశీయంగా అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ అయిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ వాటా 3.64 శాతం నుంచి 3.75 శాతానికి బలపడింది. ఎల్ఐసీకి 280 లిస్టెడ్ కంపెనీలలో 1 శాతానికిపైగా వాటా ఉంది. వెరసి ఎంఎఫ్‌లు, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, పెన్షన్ ఫండ్స్‌తోకూడిన దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(డీఐఐలు) వాటా మొత్తంగా 15.96 శాతం నుంచి 16.05 శాతానికి మెరుగుపడింది. ఇందుకు భారీగా తరలివచి్చన రూ. 1.08 లక్షల కోట్ల పెట్టుబడులు తోడ్పాటునిచ్చాయి.విదేశీ ఇన్వెస్ట్మెంట్.. 11ఏళ్ల కనిష్టం 2024 మార్చికల్లా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల వాటా 17.68 శాతానికి నీరసించింది. ఇది గత 11ఏళ్లలోనే కనిష్టంకాగా.. 2023 డిసెంబర్‌కల్లా 18.19 శాతంగా నమోదైంది. ఫలితంగా ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో డీఐఐలు, ఎఫ్‌పీఐల హోల్డింగ్(వాటాలు) మధ్య అంతరం చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఎఫ్‌పీఐలు డీఐఐల మధ్య వాటాల అంతరం 9.23 శాతానికి తగ్గింది. గతంలో 2015 మార్చిలో ఎఫ్‌పీఐలు, డీఐఐల మధ్య వాటాల అంతరం అత్యధికంగా 49.82 శాతంగా నమోదైంది. ఇది ఎన్ఎస్ఈలో లిస్టయిన 1,989 కంపెనీలలో 1,956 కంపెనీలను లెక్కలోకి తీసుకుని చేసిన మదింపు. -
8.50 లక్షల కోట్ల సంపద ఆవిరి
సెన్సెక్స్ ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో రూ.8.50 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.365 లక్షల కోట్లకు దిగివచ్చింది. ముంబై: దలాల్ స్ట్రీట్‌లో మంగళవారం అమ్మకాల మోత మోగింది. అధిక వెయిటేజీ షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు(3%), రిలయన్స్ ఇండస్ట్రీస్(2%), ఎస్బీఐ(4%) షేర్లు పతనంతో పాటు పశ్చిమాసియాలోని యుద్ధ ఉద్రికత్తలు ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. ఇటీవల విడుదలైన కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడమూ సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచింది. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. గడిచిన 3 నెలల్లో భారీగా ర్యాలీ చేసిన చిన్న, మధ్య తరహా షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ 3శాతం చొప్పున నష్టపోయాయి. పెరిగి పడిన మార్కెట్... మూడు రోజుల వరుస సెలవుల తర్వాత తెరుచుకున్న మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 444 పాయింట్లు పెరిగి 71,868 వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు బలపడి 21,717 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. కానీ, కాసేపటికే అమ్మకాల ఒత్తిడి మొదలైంది. ఒక దశలో సెన్సెక్స్ 1,189 పాయింట్లు క్షీణించి 70,235 వద్ద, నిఫ్టీ 397 పాయింట్లు దిగివచ్చి 21,193 వద్ద ఇంట్రాడే కనిష్టాలను దిగివచ్చాయి. చివరికి సెన్సెక్స్ 1,053 పాయింట్లు నష్టపోయి 70,371 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 330 పతనమై 21,242 వద్ద స్థిరపడ్డాయి. జనవరి 17 తర్వాత సూచీలకు ఇది భారీ పతనం. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లూ డీలా...! అమ్మకాల సునామీతో ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లు ఎరుపెక్కాయి. రంగాల వారీగా ఎన్ఎస్ఈలో మీడియా 13%, రియల్టీ 5%, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 4%, మెటల్, ఆయిల్‌అండ్‌గ్యాస్ 3%, బ్యాంక్ నిఫ్టీ 2%, ప్రైవేట్ రంగ బ్యాంక్ 2%, ఎఫ్ఎంసీజీ, ఆటో ఇండెక్సులు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. ఫార్మా సూచీ మాత్రమే 1.5% రాణించింది. ►నష్టాల ట్రేడింగ్‌లోనూ మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ లిస్టింగ్ సక్సెస్ అయ్యింది. ఇష్యూ ధర(రూ.418)తో పోలిస్తే బీఎస్ఈలో 11.24% ప్రీమియంతో రూ.465 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో 22% ఎగసి రూ.510 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభపడి దాదాపు లిస్టింగ్ ధర రూ.464 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.3,197 కోట్లుగా నమోదైంది. ►ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత సిప్లా షేరు రాణించింది. డిసెంబర్ క్వార్టర్లో నికర లాభం 32% వృద్ధి చెందినట్లు వెల్లడించడం కలసి వచ్చింది. బీఎస్ఈలో ఈ షేరు 7% పెరిగి రూ.1,409 వద్ద ముగిసింది. ►సోనీ గ్రూప్ 10 బిలియన్ డాలర్ల విలీన ఒప్పందం రద్దుతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేరు కుప్పకూలింది. బీఎస్ఈలో 10% నష్టంతో రూ.209 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో ఏకంగా 34% పతనమై రూ.152 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. చివరికి 33% నష్టంతో రూ.156 వద్ద స్థిరపడింది. ఒక దశలో షేరు ఇరు ఎక్సే్చంజీలో లోయర్ సర్క్యూట్‌ను తాకింది. షేరు భారీ క్షీణతతో కంపెనీకి రూ.7,300 కోట్ల నష్టం వాటిల్లింది. ►హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు పతనం ఆగడం లేదు. బీఎస్ఈలో 3.50% నష్టపోయి రూ.1428 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.65% పతనమై రూ.1,425 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10.83 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు వరుస అయిదు రోజుల్లో 13% క్షీణించింది. -
10 నెలల్లో 110 మంది సీఈవోల రాజీనామా.. కారణం ఇదే..!
కంపెనీలో పనిచేస్తున్న చిరుద్యోగి మొదలు నాయకత్వ స్థానంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిపై పనిఒత్తిడి ఉంటుంది. కానీ అది వారి స్థాయులను బట్టి మారుతోంది. కంపెనీ దానికి సంబంధించిన రంగంలో దూసుకుపోతుంటే ఇంకా మార్జిన్లు పెంచాలనే ధోరణి కనిపిస్తోంది. ఒకేవేళ మార్కెట్లో కంపెనీ స్థానాన్ని కోల్పోతే తిరిగి పునరుద్ధరించే దిశగా పనిచేయాలని ఒత్తిడి ఉంటుంది. ఏటా పెరుగుతున్న టార్గెట్లు, పనితీరులో అసహనం, సంక్లిష్టమైన వ్యాపార వాతావరణం, ప్రతిభ కోసం పాకులాట వంటి వివిధ ఒత్తిళ్ల కారణంగా కంపెనీలోని అగ్రశ్రేణి నాయకత్వంలో పని చేస్తున్న వారి రాజీనామాలు పెరుగుతున్నాయి. గడిచిన పది నెలల్లో ఏకంగా 110 మంది సీఈవోలు వారి పదవుల నుంచి వైదొలిగినట్లు సమాచారం. కొవిడ్ తర్వాత భారతదేశంలోని కంపెనీలు సీఈవో, ఎండీ స్థాయి ఉద్యోగులు రాజీనామా చేస్తున్న ధోరణి గణనీయంగా పెరిగింది. 2023 మొదటి 10 నెలల సమయంలో ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో పనిచేస్తున్న 110 మంది మేనేజింగ్ డైరెక్టర్లు లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు తమ పదవుల నుంచి వైదొలిగారు. 2023లో నమోదైన పదవుల నిష్క్రమణలో అధికంగా రాజీనామాల వల్లే జరిగినట్లు డేటా వెల్లడిస్తోంది. అగ్రనాయకత్వంపై కంపెనీల్లో పెరిగిపోతున్న అంచనాలు, ఆ అంచనాలు అందుకోకపోతే వారి పనితీరుపై అసహనం, సంక్లిష్టమైన వ్యాపార వాతావరణం వంటి వివిధ ఒత్తిళ్లతో అగ్రశ్రేణి రాజీనామాలు హెచ్చవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: మరో నెలలో రూ.625 కోట్లు నష్టం.. ఎవరికీ.. ఎందుకు.. ఎలా? మహమ్మారి సమయంలో కంపెనీలు మారితే ఆ స్థాయిలోని వారిని ఇతర సంస్థలు వెంటనే తీసుకునే పరిస్థితి లేకుండాపోయింది. దాంతో అప్పుడు ఎక్కువ రాజీనామాలు జరగలేదు. కొవిడ్‌తో దాదాపు ఏడాదికిపైగా కంపెనీలు ఆర్థిక అనిశ్చుతులు ఎదుర్కొన్నాయి. దాంతో ప్రస్తుత పరిస్థితుల్లో మార్జిన్లు, టార్గెట్లు పెంచి ఎండీ/ సీఈఓలపై ఒత్తిడి పెంచుతుండడంతో ఈ రాజీనామాలు అధికమవుతున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు అదే రంగంలోని ఇతర కంపెనీలు నైపుణ్యాలు ఉన్న అగ్రశ్రేణి నాయకత్వానికి మంచి ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నాయి. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సీఈవోల రాజీనామాలు పెరుగుతున్నాయి. -
వదంతులపై స్పందించాల్సిందే
న్యూఢిల్లీ: కంపెనీల వ్యవహారాలపై మార్కెట్లో పుట్టే వదంతుల విషయంలో లిస్టెడ్ కంపెనీలు తప్పనిసరిగా స్పందించాల్సిందేనంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ స్పష్టం చేసింది. తొలుత మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) రీత్యా టాప్–100 కంపెనీలకు వదంతులపై స్పందించడాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకు ఈ ఏడాది అక్టోబర్ 1 గడువుగా పేర్కొంది. అయితే తాజాగా ఈ గడువును వచ్చే ఏడాది (2024) ఫిబ్రవరి 1 వరకూ పొడిగించింది. ఇక టాప్–250 మార్కెట్ క్యాప్ కంపెనీలకు 2024 ఏప్రిల్ 1 నుంచి కాకుండా 2024 ఆగస్ట్ 1 నుంచి నిబంధనలు అమలుకానున్నాయి. -
ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!
MasterCard Chairman Rajnish Kumar: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ మాస్టర్‌కార్డ్ ఇండియన్ యూనిట్‌కు కుమార్‌ను చైర్మన్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సంపాదన ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. దేశీయ అతిపెద్ద బ్యాంకు అధికారిగా ఉన్నప్పడు సంపాదించిన దానికంటే మూడు రెట్టు ఎక్కువ సంపాదిస్తున్నారట. వివిధ లిస్టెడ్ సంస్థలలో డైరెక్టర్‌గా మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ఒక నివేదిక తెలిపింది. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం రజనీష్ కుమార్ FY 2023లో హీరో మోటోకార్ప్ ద్వారా రూ.38 లక్షలు, LTIMindtree ద్వారా రూ. 33.2 లక్షలు, అంబుజా సిమెంట్స్ నుంచి 17.8 లక్షలు, మొత్తంగా రూ. 89 లక్షల వేతనం పొందారు. దీనికి తోడు ఇటీవల ఎల్ అండ్ టీ, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ బోర్డులకు నియమితులయ్యారు. బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ FY 2023 వార్షిక నివేదిక ప్రకారం, ప్రతి స్వతంత్ర డైరెక్టర్‌కు బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరు కావడానికి సిట్టింగ్ ఫీజులు, కమీషన్‌తో కలిపి సంవత్సరానికి సుమారు రూ.51 లక్షల దాకా చెల్లిస్తుంది. 2023 మార్చి 30న బోర్డులో నియమితులైన రజనీష్ కుమార్ తప్ప మిగిలిన వారికి మేనేజర్ బోర్డు సమావేశానికి హాజరైనందుకు లక్ష సిట్టింగ్ ఫీజు చెల్లింస్తోంది. ఎల్ అండ్ టీ బోర్టులో మే 10, 2023 నుండి మే 9, 2028 వరకు స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు బోర్డ్ ప్రతి సమావేశానికి కంపెనీ అతనికి సిట్టింగ్ ఫీజుగా రూ.1 లక్ష చెల్లించింది.ఎస్బీఐ 2021 ఆర్థిక సంవత్సరంలో కుమార్ మొత్తం రూ. 30.34 లక్షల పరిహారాన్ని అందుకున్నారు. అలాగే 2020లో అతని జీతం రూ.31.26 లక్షలు. అయితే SBIలో ఉన్నంత కాలం విలాసవంతమైన వసతి, ఉచిత రవాణా ప్రయాణ ప్రోత్సాహకాలు తదితర అదనపు ప్రోత్సాహకాలను పొందారు. 2020 అక్టోబరు వరకు 40 సంవత్సరాలుగా ఎస్బీఐ వివిధ హోదాల్లో సేవలందించిన రజనీష్ కుమార్ స్టార్టప్ భారత్‌పైకి ఛైర్మన్‌గా ఉన్నారు. కాగా కంపెనీల చట్టం 2013 ప్రకారం, ఏ వ్యక్తి అయినా ఒకే సమయంలో ఇరవై కంటే ఎక్కువ కంపెనీలలో ఏదైనా ప్రత్యామ్నాయ డైరెక్టర్‌షిప్‌తో సహా డైరెక్టర్‌గా పదవిని కలిగి ఉండకూడదు. అయితే 10 పబ్లిక్ కంపెనీలకు మించకుండా డైరెక్టర్‌గా ఉండవచ్చు. -
లిస్టెడ్ రియల్టీల రుణాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: దేశీయంగా లిస్టయిన టాప్08 రియల్టీ కంపెనీల రుణ భారం గత మూడేళ్లుగా తగ్గుతూ వస్తోంది. దీంతో మార్చితో ముగిసిన గతేడాది(2022-23)కల్లా ఉమ్మడిగా నికర రుణ భారం రూ. 23,000 కోట్లకు పరిమితమైంది. వెరసి 2019–20లో నమోదైన రూ. 40,000 కోట్లతో పోలిస్తే 43 శాతం క్షీణించింది. ఇందుకు ప్రధానంగా గృహ విక్రయాలు జోరందుకోవడంతో మెరుగుపడిన నగదు రాక(క్యాష్ ఫ్లో) ప్రభావం చూపినట్లు అనరాక్ పేర్కొంది. రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా హౌసింగ్‌కు భారీస్థాయిలో డిమాండు కొనసాగుతోంది. ఇది దేశీయంగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన రియల్టీ రంగ దిగ్గజాలు రుణ భారాన్ని తగ్గించుకునేందుకు సహకరిస్తోంది. (ఎస్బీఐ ఖాతాదారులకు అదిరిపోయే వార్త!) రెసిడెన్షియల్పై దృష్టి గృహ నిర్మాణం, అభివృద్ధి రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాప్-8 కంపెనీలను పరిగణనలోకి తీసుకున్న అనరాక్ ఆర్థిక పనితీరును విశ్లేíÙంచింది. ఈ జాబితాలో డీఎఫ్‌ఎఫ్, మాక్రోటెక్ డెవలపర్స్(లోధా), గోద్రెజ్ ప్రాపర్టీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్, శోభా లిమిటెడ్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, పుర్వంకారా, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ ఉన్నట్లు పేర్కొంది. లిస్టెడ్ రియల్టీ డెవలపర్స్ నికర రుణ భారం 2019–20లో రూ. 40,500 కోట్లుగా నమోదుకాగా.. 2022–23కల్లా రూ. 23,000 కోట్లకు క్షీణించింది. సగటు రుణ వ్యయాలు 10.3 శాతం(2020) నుంచి 9 శాతానికి(2023) తగ్గాయి. 2020–21లో వడ్డీ వ్యయాలు 9.05 శాతంగా నమోదుకాగా.. రుణ వ్యయాలు 2021–22లో 7.96 శాతానికి చేరాయి. అమ్మకాలు, ఆదాయం పుంజుకోవడంతో రియల్టీ దిగ్గజాల నికర రుణభారానికి చెక్ పడినట్లు అనరాక్ చైర్మన్ అనుజ్ పురీ పేర్కొన్నారు. కరోనా ముందుకంటే.. జాబితాలోని లిస్టెడ్ రియల్టీ కంపెనీల అమ్మకాల పరిమాణం కరోనా మహమ్మారి ముందుస్థాయిని సైతం అధిగమించినట్లు అనుజ్ వెల్లడించారు. ఇవి కొత్త రికార్డు బాటలో సాగుతున్నట్లు తెలియజేశారు. గత కొన్నేళ్లలో నగదు రాక బలపడటంతో రుణ భారాన్ని భారీగా తగ్గించుకుంటున్నట్లు తెలియజేశారు. 2022 ఏప్రిల్ మొదలు వడ్డీ రేట్ల పెంపు రుణ వ్యయాలను నామమాత్రంగా పెంచినట్లు వివరించారు. భారీ కంపెనీలపై ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపలేదని తెలియజేశారు. ఫలితంగా 2016–17లో 17 శాతంగా ఉన్న అతిపెద్ద లిస్టెడ్, అన్‌లిస్టెడ్ డెవలపర్స్ మార్కెట్ వాటా 2022–23 కల్లా రెట్టింపై 36 శాతాన్ని తాకినట్లు వెల్లడించారు. -
లిస్టెడ్ కంపెనీలు స్పందించాల్సిందే
న్యూఢిల్లీ: మార్కెట్ పుకార్లు లేదా వార్తలు తదితరాలపై లిస్టెడ్ కంపెనీలు స్పందించవలసి ఉంటుందని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించింది. అక్టోబర్ 1నుంచి డిస్క్లోజర్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వెరసి ఇకపై లిస్టెడ్ కంపెనీలు ప్రధాన మీడియా సంస్థలలో వెలువడే మార్కెట్ రూమర్లను ఖండించడం, లేదా స్పష్టతనివ్వడం వంటివి చేపట్టవలసి ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా టాప్–100 కంపెనీలకు ఆదేశాలు అక్టోబర్ 1నుంచి వర్తించనున్నట్లు సెబీ నోటిఫికేషన్ పేర్కొంది. ఈ బాటలో టాప్–250 లిస్టెడ్ కంపెనీలకు 2024 ఏప్రిల్ 1నుంచి డిస్క్లోజర్ నిబంధనలు అమలుకానున్నాయి. ఈ కంపెనీలన్నీ ప్రధాన మీడియాలో వచ్చే మార్కెట్ పుకార్లను ఖండించడం లేదా వివరణ ఇవ్వడం లేదా స్పష్టం చేయడం వంటివి చేపట్టవలసి ఉంటుంది. అసహజరీతిలో పుట్టే పుకార్లు లేదా వార్తలు లేదా ఇతర సమాచారంపై కంపెనీలు 24 గంటల్లోగా స్పష్టతను ఇవ్వవలసి ఉంటుంది. ప్రత్యేక హక్కులపై.. లిస్టెడ్ కంపెనీల కార్పొరేట్ పాలనను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా సెబీ ప్రత్యేక హక్కుల జారీపైనా మార్గదర్శకాలను విడుదల చేసింది. తద్వారా కొంతమంది ప్రధాన వాటాదారులకు నిరంతరంగా ప్రత్యేక హక్కులను కల్పించడంపైనా సెబీ దృష్టిపెట్టింది. లిస్టెడ్ కంపెనీలు ఎవరికి ఎలాంటి ప్రత్యేక హక్కులను కేటాయించినా సాధారణ సమావేశంలో వాటాదారుల నుంచి అనుమతిని పొందవలసి ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక హక్కులను కేటాయించినప్పటినుంచి ప్రతీ ఐదేళ్లలో ఒకసారి ఇందుకు ప్రత్యేక పద్ధతిలో వాటాదారుల అనుమతి తీసుకోవలసి ఉంటుంది. ప్రమోటర్లు, వ్యవస్థాపకులు, ఇతర కార్పొరేట్ బాడీ సభ్యులకు ఇలాంటి ప్రత్యేక హక్కులను జారీ చేయడంపై కొంతకాలంగా సాధారణ వాటాదారులతోపాటు సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం ఆందోళనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సెబీ తాజా నిబంధనలకు తెరతీసింది. 2024 ఏప్రిల్ నుంచి సెబీ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై లిస్టెడ్ కంపెనీలు డైరెక్టర్ల ఎంపికలోనూ సాధారణ వాటాదారుల నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. 2024 ఏప్రిల్ 1నుంచి ఐదేళ్ల కాలంలో కనీసం ఒకసారైనా వాటాదారుల అనుమతి కోరవలసి ఉంటుంది. 2024 మార్చికల్లా బోర్డులోగల ఎవరైనా గత ఐదేళ్లలో వాటాదారుల నుంచి అనుమతి పొందకుంటే తప్పనిసరిగా అదే ఏడాది మార్చి 31 తదుపరి బోర్డును సమావేశపరచి వాటాదారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ పొందవలసి ఉంటుంది. కొనుగోళ్లు, షేర్ల కన్సాలిడేషన్, సెక్యూరిటీల బైబ్యాక్ తదితర మెటీరియల్ సమాచారాన్ని వెల్లడించే గడువును 24 గంటల నుంచి 12 గంటలకు కుదించింది. ఇదేవిధంగా డైరెక్టర్ల బోర్డు తీసుకునే నిర్ణయాలను సమావేశం ముగిసిన తదుపరి 30 నిమిషాలకు వెల్లడించవలసి ఉంటుంది. -
అంతర్జాతీయ స్థాయిలో మన ఆడిటింగ్ ప్రమాణాలు
న్యూఢిల్లీ: భారత ఆడిటింగ్ ప్రమాణాలు చాలా మటుకు అంతర్జాతీయ అకౌంటింగ్ స్టాండర్డ్‌లకు అనుగుణంగానే ఉంటున్నాయని ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్ అనికేత్ తలాతి చెప్పారు. ఆడిటర్లంటే ప్రతి ఒక్క లావాదేవీ, ప్రతి ఇన్వాయిస్ను తప్పకుండా చూస్తారని భావించడానికి ఉండదని ఆయన తెలిపారు. లిస్టెడ్ కంపెనీలు ప్రతి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను 45 రోజుల్లోగా, వార్షిక ఫలితాలను 60 రోజుల్లోగా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఆడిటర్లు ప్రతి ఒక్క లావాదేవీని చూడటం సాధ్యపడదని, అసలు ఆడిట్ ఉద్దేశం అది కాదని ఆయన పేర్కొన్నారు. అయితే, రిపోర్టింగ్ ప్రమాణాలు, బాధ్యతల విషయంలో ఆడిటర్లు సాంకేతికంగా అత్యుత్తమ స్థాయి ప్రమాణాలు, సమగ్రతను పాటించాల్సి ఉంటుందని అనికేత్ చెప్పారు. -
మార్కెట్ క్యాప్ ఢమాల్: బిలియన్ డాలర్ కంపెనీలు ఔట్
కొద్ది రోజులుగా గ్లోబల్ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీ స్టాక్ మార్కెట్లలోనూ అమ్మకాలు కొనసాగుతున్నాయి. కరోనా మహమ్మారి తదుపరి ధరలు ఊపందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు బలపడుతున్నాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు కఠిన లిక్విడిటీ విధానాలకు తెరతీయడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో దేశీయంగానూ పలు స్టాక్స్ బేర్‌మంటున్నాయి. 2021 అక్టోబర్‌లో చరిత్రాత్మక గరిష్టాలను తాకిన స్టాక్ మార్కెట్లు డీలా పడటంతో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు నేలచూపులకు పరిమితమవుతున్నాయి. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు చిల్లు పడుతోంది. రికార్డ్ స్థాయి నుంచి.. గతేడాది అక్టోబర్‌లో స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారి 62,245 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. దీంతో బిలియన్ డాలర్ల(అప్పట్లో సుమారు రూ. 7,500 కోట్లు) మార్కెట్ విలువను అందుకున్న కంపెనీలు 400కుపైగా నమోదయ్యాయి. అయితే తదుపరి ద్రవ్యోల్బణం ధాటికి యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌సహా, ఆర్బీఐవరకూ వడ్డీ రేట్ల పెంపు బాటను పట్టడంతో ఇన్వెస్టర్లకు షాక్ తగిలింది. దీనికితోడు రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం ముడిచమురు ధరలకు రెక్కలిచ్చింది. ఫలితంగా డాలరు భారీగా బలపడితే.. రూపాయి పతన బాట పట్టింది. ఈ నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో నిరవధిక అమ్మకాలు చేపడుతుండటంతో మార్కెట్లు క్షీణ పథంలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 53,235 పాయింట్ల స్థాయికి తిరోగమించింది. దీంతో లిస్టెడ్ కంపెనీల విలువలూ నీరసించాయి. గత 9 నెలల్లో మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో 660 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52 లక్షల కోట్లు) ఆవిరైందంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు! ప్రస్తుతం బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 2,45,23,834 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మధ్య, చిన్నతరహా కంపెనీలకు అమ్మకాల సెగ తగులుతోంది!! విలువల నేలచూపు మార్కెట్లతోపాటు ఇటీవల షేర్ల ధరలు సైతం కుదేలవుతున్నాయి. ఇది చాలదన్నట్లు మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 79కు చేరింది. ఫలితంగా బిలియన్ డాలర్ల(రూ. 7,900 కోట్లు) జాబితాకు రెండు వైపులా దెబ్బతగులుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. షేర్ల ధరలు తగ్గడానికితోడు రూపాయి విలువ నీరసించడంతో బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ జాబితాలో కంపెనీల సంఖ్య క్షీణించింది. దీంతో వీటి సంఖ్య తాజాగా సుమారు 340కు చేరింది. జాబితాలో వీక్ గత 9 నెలల్లో కొన్ని కంపెనీల షేర్లు పతన బాటలో సాగాయి. దీంతో వీటి విలువకు భారీగా చిల్లు పడింది. ఈ జాబితాలో మణప్పురం ఫైనాన్స్, వెల్స్పన్ ఇండియా, హెచ్ఈజీ, నజారా టెక్నాలజీస్, జెన్సార్, లక్స్ ఇండస్ట్రీస్, ఆర్బీఎల్ బ్యాంక్, దిలీప్ బిల్డ్‌కాన్ 70–50 శాతం మధ్య కుప్పకూలాయి. ఈ బాటలో లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, మెట్రోపోలిస్ హెల్త్‌కేర్, ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్, ఇండిగో పెయింట్స్, వైభవ్ గ్లోబల్, ఇండియాబుల్స్ హౌసింగ్ తదితరాలు సైతం అత్యధికంగా క్షీణించాయి. ఇవన్నీ బిలియన్ డాలర్ విలువను కోల్పోవడం గమనార్హం! ఈ కాలంలో బీఎస్ఈలోని 1,100 షేర్లను పరిగణిస్తే 75 శాతంవరకూ నష్టాల బాటలోనే సాగాయి! లాభపడ్డవీ ఉన్నాయ్ కొద్ది రోజులుగా మార్కెట్లు డీలా పడినప్పటికీ జోరందుకున్న కంపెనీలూ ఉన్నాయి. దీంతో ఇదే కాలంలో బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అందుకున్న జాబితాలో ఆటో, ఇండస్ట్రియల్ విడిభాగాల కంపెనీ ఎల్జీ ఎక్విప్మెంట్స్తోపాటు, శ్రీ రేణుకా షుగర్స్, జీఎన్ఎఫ్సీ, ఈజీ ట్రిప్ ప్లానర్స్, సుందరం క్లేటాన్, ఆర్హెచ్ఐ మెగ్నీసిటా, బోరోసిల్ రెనెవబుల్స్ చోటు సాధించాయి. ఈ షేర్లు 20–70 శాతం మధ్య జంప్‌చేయడం ఇందుకు సహకరించింది. -
షేర్ల క్రయ, విక్రయాల్లో సవరణలు చేసిన సెబీ...!
న్యూఢిల్లీ: లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్ల పెట్టుబడులు, వాటాల విక్రయం, కొనుగోళ్లు తదితర అంశాలలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సవరణలు చేపట్టింది. దీనిలో భాగంగా పబ్లిక్ ఇష్యూల తదుపరి ప్రమోటర్ల వాటాలపై లాకిన్ కాలపరిమితిని 18 నెలలకు తగ్గించింది. ప్రస్తుతం మూడేళ్ల లాకిన్ నిబంధనలు అమలవుతున్నాయి. ఇటీవల సెకండరీ మార్కెట్ దూకుడు కారణంగా ప్రైమరీ మార్కెట్ సైతం జోరందుకున్న సంగతి తెలిసిందే. దీంతో పలు కంపెనీలు ఐపీవోల ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా సవరణలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వీటితోపాటు గ్రూప్ కంపెనీలకు సంబంధించి వెల్లడించాల్సిన కొన్ని అంశాలపైనా నిబంధనలను క్రమబద్ధీకరించింది. ఇందుకు అనుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు తాజా నిబంధనలు ఈ నెల 13 నుంచీ అమల్లోకి వచ్చాయి. (చదవండి: ఆపిల్ కంపెనీకి భారీ షాక్..!) 20 శాతం వాటా.. ఒక ప్రాజెక్టుకు పెట్టుబడి వ్యయాల కోసంకాకుండా ఓఎఫ్ఎస్ లేదా ఫైనాన్సింగ్ కోసం పబ్లిక్ ఇష్యూ చేపడితే.. ప్రమోటర్ల నుంచి కనీసం 20 శాతం కంట్రిబ్యూషన్ ఉండాలి. అలాట్మెంట్ సమయం నుంచి 18 నెలల గడువు దీనికి వర్తిస్తుంది. ప్రస్తుతం మూడేళ్ల కాలపరిమితి అమలవుతోంది. పెట్టుబడి వ్యయాల పద్దుకింద సివిల్ పనులు, మిస్లేనియస్ ఫిక్స్డ్ ఆస్తులు, భూమి కొనుగోలు, భవనాలు, ప్లాంట్ మెషినరీ తదితరాలు వస్తాయి. 20 శాతానికి పైబడిన వాటా విషయంలో ప్రస్తుతమున్న 12 నెలల కాలపరిమితిని ఆరు నెలలకు సెబీ కుదించింది. ఐపీవోకు ముందు సెక్యూరిటీస్ కొనుగోలు చేసే ప్రమోటరేతర వ్యక్తులకు సైతం లాకిన్ గడువు ప్రస్తుతం అమలవుతున్న 12 నెలల నుంచి ఆరు నెలలకు పరిమితంకానుంది. ఇక గ్రూప్ కంపెనీలకు సంబంధించి ఐపీవో సమయంలో వెల్లడించవలసిన అంశాలపైనా సెబీ నిబంధనలు క్రమబద్ధీకరించింది. గ్రూప్‌లోని టాప్–5 లిస్టెడ్ లేదా అన్‌లిస్టెడ్ సంస్థల ఆర్థిక సమాచారాన్ని ఆఫర్ డాక్యుమెంట్లో పొందుపరచవలసిన అవసరం ఉండదు. వీటిని కంపెనీ వెబ్సైట్లో ఉంచితే సరిపోతుంది. ప్రయివేట్ కంపెనీలకు.. సెబీ తాజా నోటిఫికేషన్ ప్రకారం ఐపీవోను చేపట్టే ప్రయివేట్ రంగ కంపెనీలు అధీకృత సంస్థ లేదా కార్పొరేషన్ లేదా ఏ ఇతర ఎస్పీవీ ద్వారా అన్ని గ్రూప్ కంపెనీల కార్యాలయ వివరాలను ఆఫర్ డాక్యుమెంట్లో వెల్లడించవలసి ఉంటుంది. ఇందుకు వీలుగా ఐసీడీఆర్ నిబంధనలను సెబీ సవరించింది. వీటికి ఈ నెల మొదట్లో సెబీ బోర్డు ఆమోదముద్ర వేసిన విషయం విదితమే. ఇక కంపెనీల కొనుగోళ్లు లేదా ప్రమోటర్ల మార్పిడి విషయంలో వెల్లడించవలసిన అంశాలపై సెబీ కొన్ని ప్రత్యేక నిబంధనలను తొలగించింది. వ్యవస్థీకృత వెల్లడి(ఎస్డీడీ) అమలు నేపథ్యంలో టేకోవర్ నిబంధనలను సవరించింది. తాజా నిబంధనల ప్రకారం కొనుగోలుదారులు లేదా ప్రమోటర్లు షేర్ల కొనుగోలు లేదా అమ్మకం విషయంలో 5 శాతం వరకూ, ఆపై మరో 2 శాతం వరకూ ఫిజికల్‌గా వెల్లడించవలసిన అవసరం ఉండబోదు. ఇది 2022 ఏప్రిల్1 నుంచి అమల్లోకి రానుంది. ఇలాంటి లావాదేవీల విషయంలో స్టాక్ ఎక్సే్ఛంజీలు డిపాజిటరీల నుంచే స్వయంగా డేటాను పొందేందుకు వీలుంటుంది. లిస్టింగ్ అంశాలపై ఇలా..: లిస్టింగ్, వెల్లడించవలసిన అంశాలపైనా సెబీ విడిగా మార్గదర్శకాలను సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మార్పిడి రహిత రుణ సెక్యూరిటీలు, మార్పిడికి వీలులేని రిడీమబుల్ ఫ్రిఫరెన్స్ షేర్లు, పర్పెచ్యువల్ రుణ సెక్యూరిటీలు లేదా పర్పెచ్యువల్ నాన్‌క్యుమిలేటివ్ ప్రిఫరెన్స్ షేర్ల లిస్టింగ్ విషయంలో నిబంధనలు సరళీకరించింది. తద్వారా పారదర్శకత పెంపు, క్రమబద్ధీకరణ, అనవసర ప్రొవిజన్లు ఎత్తివేడంతో కార్పొరేట్ బాండ్ మార్కెట్‌కు జోష్ లభించే వీలుంది. మార్పిడికి వీలుకాని సెక్యూరిటీలకు సంబంధించిన సమాచారం, డాక్యుమెంట్లను లిస్టెడ్ కంపెనీలు ఇన్వెస్టర్లకు ఈమెయిల్స్ ద్వారా పూర్తి స్థాయిలో సాఫ్ట్ కాపీల రూపంలో అందించవలసి ఉంటుంది. కొత్త టెక్ సంస్థలకు ఆవిష్కర్తల(ఇన్నోవేటర్స్) వృద్ధి ప్లాట్‌ఫామ్(ఐజీపీ) ద్వారా ఆధునిక టెక్నాలజీ కంపెనీలు జారీ చేసే స్వెట్ ఈక్విటీ నిబంధనలను సైతం సెబీ తాజాగా సరళీకరించింది. కొంతకాలంగా పలు స్టార్టప్‌లు విదేశాల నుంచి సైతం భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. ఐజీపీ లిస్టెడ్ కంపెనీలకు స్వెట్ ఈక్విటీ షేర్ల వార్షిక పరిమితి 15 శాతంగా అమలుకానుంది. మొత్తం గా 50 శాతంవరకూ వీటికి వీలుంటుంది. కంపె నీ ఆవిర్భవించిన పదేళ్ల కాలంలో ఇది వర్తించనుంది. మెయిన్‌బోర్డ్‌లో లిస్టెడ్ కంపెనీలకు ఈ షేర్ల వార్షిక పరిమితి 15 శాతంకాగా.. మొత్తం 25 శాతంవరకూ జారీకి వీలుంది. కాగా.. షేర్ల ఆధారిత ఉపాధి లబ్ది, స్వెట్ ఈక్విటీ నిబంధనలను ఈ సందర్భంగా సెబీ ఒక్కటిగా మార్చింది. సాధారణంగా కంపెనీలు నగదేతర లావాదేవీకింద స్వెట్ ఈక్విటీని జారీ చేస్తాయి. స్టార్టప్‌లు, ప్రమోటర్లు.. వీటి ద్వారా కంపెనీలకు నిధులు అందించేందుకు వినియోగిస్తుంటారు. వాటాదారుల అనుమతితతో ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంబంధ ఉద్యోగులకు స్వెట్ ఈక్విటీని జారీ చేస్తుంటాయి. వీసీఎఫ్‌లు తదితర ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, స్టాక్ ఎక్సే్ఛంజీలు తదితర మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్కు సంబంధించిన నిబంధనలను కూడా సెబీ తాజా గా సవరించింది. తద్వారా బిజినెస్ నిర్వహణ, నిబంధనల అమలును సులభతరం చేసింది. (చదవండి:ఈ మొబైల్ రీఛార్జ్‌తో ఏడాదిపాటు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీ హట్‌స్టార్ ఉచితం..!) -
కోవిడ్-19లోనూ దిగ్గజాల దూకుడు
న్యూయార్క్: ఈ కేలండర్ ఏడాది(2020)లో తలెత్తిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను సంక్షోభంలోకి నెట్టింది. అటు ఆరోగ్యపరంగా, ఇటు ఆర్థిక వ్యవస్థలనూ కుదేల్ చేసింది. అయినప్పటికీ కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు ప్రకటించిన చర్యలూ సహాయక ప్యాకేజీలతో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పడుతున్నాయి. కాగా.. కోవిడ్-19 కారణంగా ఆన్లైన్, ఈకామర్స్, రిటైల్, ఐటీ రంగాలలో మరిన్ని కొత్త అవకాశాలకు మార్గమేర్పడినట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2020 జనవరి -జూన్ మధ్య కాలంలో పలు యూఎస్ దిగ్గజ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన పలు బ్లూచిప్ కంపెనీల షేర్లు ర్యాలీ బాటలో్ సాగుతూ వచ్చాయి. వెరసి పలు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) భారీగా బలపడుతూ వచ్చింది. జాబితాలో ఈకామర్స్, టెక్నాలజీ, ఆటోమోటివ్, ఫైనాన్స్, టెలికం, మీడియా, రిటైల్, ఫార్మా తదితర రంగాలుండటం గమనార్హం! (4 నెలల్లో 4 బిలియన్ డాలర్ల దానం) టాప్4లో.. ఈ ఏడాది జనవరి1 నుంచి జూన్ 17వరకూ చూస్తే.. మార్కెట్ విలువలో అత్యధికంగా లాభపడిన కంపెనీగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ నిలిచింది. కంపెనీ మార్కెట్ క్యాప్ 401 బిలియన్ డాలర్లకుపైగా ఎగసింది. ఇదేవిధంగా సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దాదాపు 270 బిలియన్ డాలర్ల విలువను పెంచుకోవడం ద్వారా రెండో ర్యాంకులో నిలిచింది. ఈ బాటలో ఐఫోన్ల దిగ్గజం యాపిల్ మార్కెట్ విలువ 219 బిలియన్ డాలర్లు జంప్‌చేయగా.. ఎలక్ట్రిక్ కార్ల బ్లూచిప్ కంపెనీ టెస్లా ఇంక్ 108 బిలియన్ డాలర్లకుపైగా ఎగసింది. తద్వారా జాబితాలో మూడు, నాలుగు ర్యాంకులను కైవసం చేసుకున్నాయి. ఈ జాబితాలో టెక్నాలజీ కంపెనీ టెన్సెంట్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, చిప్ కంపెనీ ఎన్విడియా, ఇంటర్నెట్ దిగ్గజం అల్ఫాబెట్, టెలికం దిగ్గజం టీమొబైల్, మీడియా దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తదితరాలు సైతం చోటు చేసుకున్నాయి. ఇదేవిధంగా వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలు అందించే జూమ్ యాప్ ప్రస్తావించదగ్గ స్థాయిలో పుంజుకోవడం విశేషం! జాబితాలో టెక్ దిగ్గజం టెన్సెంట్, ఈకామర్స్ దిగ్గజం అలీబాబా వంటి చైనీస్ కంపెనీలు సైతం స్థానం సంపాదించినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇతర వివరాలు టేబుల్ ద్వారా చూద్దాం.. 2020 జనవరి- జూన్ 17 మధ్య వివిధ యూఎస్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగిన తీరిలా.. -
మార్చి త్రైమాసికంలో రూ.22,500 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మన దేశంలోకి అడుగు పెట్టిన మార్చి త్రైమాసిక కాలంలో 159 లిస్టెడ్ (బీఎస్ఈలో) కంపెనీలు రూ.22.538 కోట్ల మేర ఎబిట్డా (పన్ను, వడ్డీ, తరుగుదలకు ముందు) రూపంలో కోల్పోయినట్టు కన్సల్టెన్సీ సంస్థ యర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) ఓ నివేదిక రూపంలో తెలియజేసింది. డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంతో పోల్చినప్పుడు.. మార్చి త్రైమాసికంలో కరోనా కారణంగా ఏర్పడిన అడ్డంకులు 300 బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీలు, 115 అంతర్జాతీయ సంస్థల లాభదాయకత, ఆర్థిక పరిస్థితులు, నగదు లభ్యత తదితర అంశాలపై ఏ విధంగా ఉందని విశ్లేషించిన అనంతరం ఈ వివరాలను ఈవై ఒక నివేదికలో పొందుపరిచింది. కరోనా వైరస్ ప్రభావం తమ వ్యాపార కార్యకలాపాలపై ఏ విధంగా ఉందన్న వివరాలను ఫలితాల సందర్భంగా కంపెనీలు విడుదల చేసిన వివరాలు, అందుబాటుులో ఉన్న ఇతర వివరాలను ఈవై అనలిస్టులు పరిగణనలోకి తీసుకుని చూశారు. జూన్ 5 నాటికి ఫలితాలను విడుదల చేసిన కంపెనీలను పరిశీలనలోకి తీసుకున్నారు. మార్చి 25న దేశవ్యాప్త లాక్ డౌన్ విధించడం, అది మే చివరి వరకు అధికంగా కొనసాగడం తెలిసిందే. ఆ తర్వాత కూడా పాక్షిక లాక్ డౌన్ లు కొనసాగుతున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను చవిచూస్తుండడం గమనార్హం. నివేదికలోని అంశాలు.. ► 300 బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో 159 కంపెనీలు ఎబిటా రూపంలో మార్చి త్రైమాసికంలో రూ.22,538 కోట్లను కోల్పోయాయి. ► కరోనా మహమ్మారి ప్రభావం, అననుకూల ఆర్థిక పరిస్థితుల ప్రభావం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, బీమా రంగాలు (బీఎఫ్ఎస్ఐ), విమానయాన పరిశ్రమ, ఆటోమోటివ్, విద్యుత్తు, ఆయిల్ అండ్ గ్యాస్, ట్రావెల్ రంగాలపై ఎక్కువగా పడింది. ► ఫార్మాస్యూటికల్స్, హెల్త్ కేర్, టెలికం రంగాలు మాత్రం ఈ కాలంలో మంచి వృద్ధిని చూపించాయి. ► రుణ నష్టాలకు సంబంధించి కేటాయింపులు గణనీయంగా పెంచాల్సిరావడం, ఇంపెయిర్మెంట్, నిల్వల కారణంగా ఏర్పడి నష్టాలు ప్రతికూల పరిణామాలకు కారణం. -
త్రైమాసిక ఫలితాల వాయిదాకు అనుమతినివ్వండి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక ఫలితాలను వాయిదా వేయడానికి లేదా సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో విలీనం చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ లిస్టెడ్ కంపెనీలు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని కోరాయి. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్త లాక్డౌన్ విధింపుతో ఏప్రిల్-మే మధ్యకాలంలో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడం, అమ్మకాలు క్షీణించడంతో విస్తృతమైన భారీ నష్టాలను నమోదు కావచ్చని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే లాక్డౌన్ తరువాత స్టాక్ ధరలు భారీగా క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రిఫరెన్షియల్ ఈక్విటీ ఆఫర్, ఓపెన్ ఆఫర్లపై నిబంధనలను సడలించాలని కొన్ని ప్రముఖ కంపెనీలు సంస్థలు సెబీని కోరాయి. త్రైమాసికాల్లో నమోదయ్యే భారీ నష్టాలు కంపెనీల నికర విలువను.., రుణాలు తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తాయడంతో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత పరిస్థితి ఇంతకు ముందెన్నడూ జరగనిది. అయితే పారదర్శకత, కార్పొరేట్ పాలన ప్రమాణాలకు వ్యతిరేకంగా కంపెనీల ప్రతిపాదనను సెబీ పరిశీలించాల్సి ఉంటుందని సీనియయర్ ఛార్టెర్ అకౌంటెండ్ దిలీప్ లఖాని తెలిపారు. స్టాక్ మార్కెట్లో లిస్టైన ప్రతి కంపెనీ త్రైమాసికం ముగిసిన 45 రోజుల్లోగా తమ ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే కంపెనీల ప్రతిపాదనపై సెబీ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. -
మహిళా డెరైక్టర్లను నియమించండి..
- లిస్టెడ్ కంపెనీలకు సెబీ ఆదేశాలు - గడువు ఈ నెల 31 వరకే ముంబై: మహిళా డెరైక్టర్ల విషయమై స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఒత్తిడి పెంచుతోంది. ఈ నెల చివరి కల్లా డెరైక్టర్ల బోర్డ్‌లో కనీసం ఒక మహిళనైనా నియమించుకోవాలని లిస్టెడ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లిస్టైన కంపెనీల్లో అగ్రశ్రేణి 500 కంపెనీల్లో కనీసం మూడో వంతు కంపెనీల్లో మహిళా డెరైక్టర్లు లేరని గుర్తించిన సెబీ ఈ విషయమై 160కు పైగా కంపెనీలకు లేఖలు రాసింది. గడువులోగా మహిళా డెరైక్టర్ల నియామకం కోసం తగిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కొన్ని కంపెనీలు సెబీకి ప్రత్యుత్తరాలు రాశాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీలు ఏప్రిల్ 1లోగా కనీసం ఒక మహిళనైనా డెరైక్టర్‌గా నియమించుకునేలా చూడాలని కంపెనీ వ్యవహారాల శాఖకు కూడా సెబీ లేఖలు రాసింది. గత ఏడాది అక్టోబర్ నాటికే మహిళా డెరైక్టర్లను నియమించాలని సెబీ ఆదేశించింది. ఆ తర్వాత ఈ గడువును మరో 6 నెలలు పొడిగించింది. ఇది కూడా ముగియనుం డటంతో మహిళా డెరైక్లర్లను నియమించని కంపెనీలపై తీవ్ర చర్యలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. -
నల్లధనంతో లింకున్న కంపెనీలపై సెబీ నిషేధం!
న్యూఢిల్లీ: నల్లధనం తరలింపు, పన్ను ఎగవేతలకు అడ్డాగా మారుతున్న లిస్టెడ్ కంపెనీలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి మూడు కొలమానాలను సెబీ గుర్తించింది. ఒకటికంటే ఎక్కువ అంశాల్లో సంబంధిత లిస్టెడ్ కంపెనీకి ప్రమేయం ఉన్నట్లు తేలితే స్టాక్ మార్కెట్లో ఆయా షేర్ల ట్రేడింగ్ నిలిపివేయాలని(సస్పెన్షన్) సెబీ భావిస్తోంది. కంపెనీలు ఎక్స్ఛేంజీలకు తెలిపిన అడ్రస్‌లలో ఎలాంటి కార్యాలయాలు, కార్యకలాపాలు లేనప్పటికీ(షెల్ కంపెనీలు).. వాటి షేర్ల ట్రేడింగ్ మాత్రం చురుగ్గా జరుతుతున్నాయి. మరోపక్క, నల్లధనం తరలింపునకు ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపును కూడా కొన్ని కంపెనీలు చేపడుతున్నాయి. అదేవిధంగా కంపెనీ ఆర్థిక మూలాలు ఘోరంగా ఉన్నప్పటికీ.. షేరు ధరలు మాత్రం దూసుకెళ్తుండటం ఈ అక్రమాల్లో భాగమేనన్నది సెబీ అభిప్రాయం. అనుమానిత కంపెనీలకు సంబంధించి ఈ మూడు అంశాల్లో ఒకటికంటే ఎక్కువ ఉన్నట్లు భావిస్తే.. వాటిపై ట్రేడింగ్ సస్పెన్షన్ కొరడా ఝలిపించాలని నిర్ణయించినట్లు సెబీ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో అనేక చిన్న ఎన్బీఎఫ్సీలు, బ్రోకర్లపై ఇప్పటికే సెబీ కన్నేసిందని కూడా విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో కొన్ని లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లూ ఉన్నట్లు తెలిపాయి. స్టాక్ మార్కెట్ల ద్వారా నల్లధనం చేతులుమారింది.. పన్నుల ఎగవేతల మొత్తం విలువను కచ్చితంగా లెక్కగట్టడం కష్టసాధ్యమేనని, అయితే, ఈ అక్రమ లావాదేవీల కొన్ని వేల కోట్ల రూపాయల్లో ఉండొచ్చనేది సెబీ వర్గాల అంచనా. -
పావు గంటలో సమాచారమివ్వాల్సిందే
ముంబై: బోర్డు సమావేశాలు ముగిసిన 15 నిమిషాల్లోగా లిస్టెడ్ కంపెనీలు ఆ వివరాలను స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసేలా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా నిధుల సమీకరణ ప్రణాళికలు, డివిడెండ్లు, బోనస్‌లు, షేర్ల బైబ్యాక్ వంటి నిర్ణయాలను సమావేశం ముగిసిన పావుగంటలోగా కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ అంశంపై సెబీ చర్చాపత్రాలను విడుదల చేసింది. తద్వారా లిస్టెడ్ కంపెనీలు షేరు ధరపై ప్రభావాన్ని చూపగల కీలకమైన సమాచారాన్ని నిర్ణీత సమయంలోగా వెల్లడించేలా చేయాలన్నది సెబీ ప్రణాళిక. వెరసి ఇలాంటి అంశాల వెల్లడిలో ఆలస్యానికి చెక్ పెట్టాలని భావిస్తోంది. వీటితోపాటు ఆర్థిక ఫలితాలు, స్వచ్చంద డీలిస్టింగ్, బోనస్ షేర్ల జారీ ద్వారా క్యాపిటల్ పెంచుకోవడం, రద్దు చేసిన షేర్లను తిరిగి జారీ చేయడంవంటి అంశాలను కూడా వెల్లడించేలా నిబంధనలను తీసుకు వచ్చే యోచనలో ఉన్నట్లు 26 పేజీల చర్చా పత్రాల్లో సెబీ పేర్కొంది.


