ఫ్యాప్సీ ప్రెసిడెంట్‌గా గౌర శ్రీనివాస్‌ | CMD Gaura Srinivas elected to fapci precident | Sakshi
Sakshi News home page

ఫ్యాప్సీ ప్రెసిడెంట్‌గా గౌర శ్రీనివాస్‌

Jul 6 2017 2:01 AM | Updated on Sep 5 2017 3:17 PM

ఫ్యాప్సీ ప్రెసిడెంట్‌గా గౌర శ్రీనివాస్‌

ఫ్యాప్సీ ప్రెసిడెంట్‌గా గౌర శ్రీనివాస్‌

ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) నూతన ప్రెసిడెంట్‌గా 2017–18 సంవత్సరానికిగాను గౌర గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) నూతన ప్రెసిడెంట్‌గా 2017–18 సంవత్సరానికిగాను గౌర గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ సీఎండీ గౌర శ్రీనివాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కెమికల్స్, పాలిమర్స్, మెటల్స్, కంప్యూటర్‌ సొల్యూషన్స్, రియల్టీ, కన్‌స్ట్రక్షన్, ఫార్మా, ఎన్‌బీఎఫ్‌సీ, ఏరోస్పేస్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ తదితర రంగ సంస్థల్లో కీలక పదవులు చేపట్టారు.

మార్కెటింగ్, ఫైనాన్స్‌ విభాగాల్లో 40 ఏళ్లకుపైగా అనుభవం ఆయన సొంతం. రవీంద్ర మోదీ పదవీ కాలం ముగియడంతో ఆయన  స్థానంలో ప్రెసిడెంట్‌గా గౌర శ్రీనివాస్‌ బాధ్యతలు స్వీకరించారు. ఫ్యాప్సీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా చార్టర్డ్‌ అకౌంటెంట్‌ అరుణ్‌ లుహారుకా నియమితులయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement