సెంట్రల్‌ బ్యాంక్‌ ఉద్యోగుల విరాళం 11.90 కోట్లు...

Central Bank of India 11 cr Donation for PM CARES FUND - Sakshi

న్యూఢిల్లీ: కరోనాపై పోరు బాటలో  సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగులు పీఎం–కేర్స్‌ ఫండ్‌కు రూ.11.90 కోట్ల విరాళం ఇవ్వనున్నారు. దాదాపు 29,600 మంది ఉద్యోగులు తమ రెండు రోజుల వేతనాన్ని ఫండ్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి.  

సింఫనీ సహాయం..: కాగా కోవిడ్‌–19పై పోరాటంలో భాగంగా గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వానికి 1000 ఎయిర్‌ కూలర్లను సరఫరా చేయాలని  ప్రముఖ ఎయిర్‌ కూలింగ్‌ కంపెనీ సింఫనీ నిర్ణయించింది. ఆసుపత్రులు, క్వారంటైన్‌ సెంటర్లు, ఇతర హెల్త్‌కేర్‌ సెంటర్లలో ఈ ఎయిర్‌ కూలర్లను గుజరాత్‌ ఆరోగ్యశాఖ వినియోగించనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top