సెల్‌కాన్.. అత్యంత తేలికైన స్మార్ట్‌ఫోన్ | celkon of the most lightweight smartphone .. | Sakshi
Sakshi News home page

సెల్‌కాన్.. అత్యంత తేలికైన స్మార్ట్‌ఫోన్

Aug 1 2014 2:30 AM | Updated on Sep 2 2017 11:10 AM

సెల్‌కాన్.. అత్యంత తేలికైన స్మార్ట్‌ఫోన్

సెల్‌కాన్.. అత్యంత తేలికైన స్మార్ట్‌ఫోన్

మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్‌కాన్ క్యాంపస్ సిరీస్‌లో ఎవోక్ ఏ43 మోడల్‌ను గురువారమిక్కడ భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

  • ఆవిష్కరించిన సినీ హీరో సూర్య ధర రూ.5,699
  • ఎవోక్ ఏ43ని ఆవిష్కరిస్తున్న సినీ హీరో సూర్య(కుడి నుంచి రెండో వ్యక్తి). చిత్రంలో ఎడమ నుంచి మురళి రేతినేని, వై.గురు, లింగుస్వామి,లగడపాటి శ్రీధర్
  • హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్‌కాన్ క్యాంపస్ సిరీస్‌లో ఎవోక్ ఏ43 మోడల్‌ను గురువారమిక్కడ భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. తమిళ హీరో సూర్య ఈ మోడల్‌ను ఆవిష్కరించారు. ప్రపంచంలో అతి తేలికైన స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది. బరువు 68 గ్రాములు. బ్యాటరీతో కలిపి బరువు 93 గ్రాములుంది. అందుబాటు ధరలో, స్టైలిష్, అప్లికేషన్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోరేవారి కోసం ఎవోక్ ఏ43 రూపొందించామని సెల్‌కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

    4 అంగుళాల డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3 గిగా హెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1 జీబీ ర్యామ్, ఆన్‌డ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్  ఇందులోని ఫీచర్లని వివరించారు. 3జీ వీడియో కాలింగ్, 5 ఎంపీ కెమెరా, 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1,400 ఎంఏహెచ్ బ్యాటరీ, వైఫై, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి విశిష్టతలు ఉన్నాయని చెప్పారు. ధర  రూ.5,699 ఉంది. క్యాంపస్ సిరీస్ ప్రజాదరణ పొందిందని సెల్‌కాన్ ఈడీ మురళి రేతినేని తెలిపారు.ఆవిష్కరణలో సికిందర్ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్, దర్శకులు లింగుస్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement