breaking news
celkon campus series
-
సెల్కాన్.. అత్యంత తేలికైన స్మార్ట్‌ఫోన్
ఆవిష్కరించిన సినీ హీరో సూర్య ధర రూ.5,699 ఎవోక్ ఏ43ని ఆవిష్కరిస్తున్న సినీ హీరో సూర్య(కుడి నుంచి రెండో వ్యక్తి). చిత్రంలో ఎడమ నుంచి మురళి రేతినేని, వై.గురు, లింగుస్వామి,లగడపాటి శ్రీధర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్కాన్ క్యాంపస్ సిరీస్‌లో ఎవోక్ ఏ43 మోడల్‌ను గురువారమిక్కడ భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. తమిళ హీరో సూర్య ఈ మోడల్‌ను ఆవిష్కరించారు. ప్రపంచంలో అతి తేలికైన స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది. బరువు 68 గ్రాములు. బ్యాటరీతో కలిపి బరువు 93 గ్రాములుంది. అందుబాటు ధరలో, స్టైలిష్, అప్లికేషన్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోరేవారి కోసం ఎవోక్ ఏ43 రూపొందించామని సెల్కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. 4 అంగుళాల డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ డిస్ప్లే, 1.3 గిగా హెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1 జీబీ ర్యామ్, ఆన్‌డ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఇందులోని ఫీచర్లని వివరించారు. 3జీ వీడియో కాలింగ్, 5 ఎంపీ కెమెరా, 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1,400 ఎంఏహెచ్ బ్యాటరీ, వైఫై, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి విశిష్టతలు ఉన్నాయని చెప్పారు. ధర రూ.5,699 ఉంది. క్యాంపస్ సిరీస్ ప్రజాదరణ పొందిందని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని తెలిపారు.ఆవిష్కరణలో సికిందర్ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్, దర్శకులు లింగుస్వామి పాల్గొన్నారు. -
సెల్కాన్ కేంపస్ సిరీస్‌లో కొత్త మోడల్
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ కంపెనీ సెల్కాన్, కేంపస్ సిరీస్‌లో సరికొత్త మోడల్, కేంపస్ ఏ 125ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటి వరకూ కేంపస్ సిరీస్‌లో 9 మోడళ్లను అందించామని, ఇవన్నీ రూ.6,000 లోపు ధర ఉన్న మోబైల్ ఫోన్లని సెల్కాన్ సీఎండీ, వై. గురు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంపస్ ఏ 125ను ఫ్లిప్ కవర్‌తో సహా రూ.6,399కే అందిస్తున్నామని వివరించారు. 4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ 1.3 గిగా డ్యుయల్ కోర్ ప్రాసెసర్ సామర్థ్యంతో పనిచేస్తుందని పేర్కొన్నారు. 4 జీబీ ఇంటర్నల్ మెమెరీ ఉన్న ఈ ఫోన్లో ఫ్లాష్‌తో కూడిన 5 మెగా పిక్సెల్ కెమెరా, 3జీ వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ కెమెరా, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. షేక్ అండ్ షేర్, మల్టీ ప్లేయర్ గేమింగ్, డూడ్లింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయని తెలిపారు. వినియోగదారులు తమ మాతృభాషలో మెసెజ్‌లు పంపుకునేందుకు వీలుగా 9 భాషల మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ ప్రత్యేక ఆకర్షణ అని గురు వివరించారు.