దొంగ ‘దాతృత్వ’ సంస్థలపై ఐటీ కన్ను | CBDT advises IT officials to be strict towards illegal charity | Sakshi
Sakshi News home page

దొంగ ‘దాతృత్వ’ సంస్థలపై ఐటీ కన్ను

Jun 10 2015 1:17 AM | Updated on Sep 27 2018 4:02 PM

దొంగ ‘దాతృత్వ’ సంస్థలపై ఐటీ కన్ను - Sakshi

దొంగ ‘దాతృత్వ’ సంస్థలపై ఐటీ కన్ను

దాతృత్వం(చారిటీ) ముసుగులో ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అక్రమ సంస్థలను గుర్తించాలని ఐటీ శాఖను ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) ఆదేశించింది...

న్యూఢిల్లీ: దాతృత్వం(చారిటీ) ముసుగులో ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అక్రమ సంస్థలను గుర్తించాలని ఐటీ శాఖను ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) ఆదేశించింది. ఇందుకు సంబంధించి పటిష్ట ఆధారాలను సంపాదించాలని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇలాంటి అక్రమ చారిటీ సంస్థల వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయ నష్టం జరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిజానికి అక్రమ చారిటీ సంస్థలు ఏవి? సక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న చారిటీల ఏవి? అన్న విషయాన్ని నిర్థారించుకోవడం కష్టమే అయినా... దీనికి ఒక సవాలుగా పన్ను అధికారులు స్వీకరించాలని సీబీడీటీ సూచించింది. వ్యత్యాసాన్ని గుర్తించడంలో అధికారులందరూ తమ అనుభవాలను వినియోగించుకోవాలని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement