♦ విద్యార్థి దశలోనే కెరీర్ ఎంచుకోవచ్చు
♦ కోర్సులు, భవిష్యత్తు ఉద్యోగాలేంటో చెబుతాం
♦ ‘లోడ్‌స్టార్’ నుంచి కెరీర్ గైడెన్స్ సేవలు
♦ 100 మంది గైడెన్స్ నిపుణులతో ఒప్పందం
♦ బెంగళూరు, హైదరాబాద్, మైసూర్‌లలో సేవలు
♦‘స్టార్టప్ డైరీ’తో లోడ్‌స్టార్ ఫౌండర్ మురళీధర్ ఎస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : యూఎక్స్ డిజైనర్, యాచురీ, క్యూరేటర్, జెనిటీసిస్ట్, టాక్సికాలజిస్ట్, సోషల్ మీడియా అడ్వైజర్.. ఇవేవో కొత్త టెక్నాలజీ కోర్సులనుకునేరూ! కొత్త ఉద్యోగాలండి బాబూ!!ఇలా ఒకటా రెండా.. 260కి పైగా కొత్త ఉద్యోగాల జాబితాను సిద్ధం చేసింది లోడ్‌స్టార్. మరి ఆ ఉద్యోగాల్లో చేరాలంటే ఎలా? ఏం చదవాలి? వీటికి సమాధానమే లోడ్‌స్టార్ కెరీర్ గైడెన్స్ స్టార్టప్. విద్యార్థి దశలోనే కెరీర్ గైడెన్స్ అందిస్తోందీ సంస్థ. మరిన్ని వివరాలను లోడ్‌స్టార్ ఫౌండర్ సీఈఓ మురళీధర్.ఎస్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే...
లోడ్‌స్టార్ గురించి చెప్పాలంటే ముందుగా తొలి స్టార్టప్ మెరిట్‌ట్రాక్ గురించి చెప్పాలి. కంపెనీలకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అందించే సంస్థ. తర్వాత దీన్ని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ కొనుగోలు చేసింది. ఓ సారి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎంపికైన ఉద్యోగులు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవటానికి ఓ సర్వే చేశాం. దాన్లో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎంపికైన ఉద్యోగులు కొందరు.. ఆ తర్వాత అసలీ ఉద్యోగం తమకు కరెక్ట్ కాదని, కెరీర్‌ను తప్పుగా ఎంచుకున్నామని భావిస్తున్నారు. దీనిక్కారణం విద్యార్థి దశలోనే కెరీర్ ఎంపిక, చేయబోయే వృత్తిపై అవగాహన లేకపోవటమేనని తెలిసింది. అప్పుడే నిర్ణయించుకున్నాం.. క్యాంపస్ ప్లేస్మెంట్ బదులు కెరీర్ గైడెన్స్ ఇస్తే సక్సెస్ అవుతామని! అలా 2015లో లోడ్‌స్టార్ స్టార్టప్ ప్రారంభమైంది. లోడ్‌స్టార్ గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే 10వ తరగతి పూర్తయ్యే విద్యార్థులను ఎంపిక చేసి వారి ఆసక్తిని గుర్తించి.. సరైన కెరీర్‌ను ఎంపిక చేయటమే.
ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ సేవలు..
లోడ్‌స్టార్ అసెస్మెంట్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా ఉంటుంది. అంటే ముందుగా రిజిస్టర్ చేసుకున్న విద్యార్థి ఆసక్తులు, కెరీర్ అవగాహన వంటి వాటిపై ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తాం. ఫలితాలు, విద్యార్థి ఆసక్తిని బట్టి కెరీర్ ఆప్షన్లను వివరిస్తాం. ఆపై ఆఫ్‌లైన్‌లో నేరుగా నిపుణులు వద్దకు వెళ్లి ప్రవేశ పరీక్షలు, కళాశాల ఎంపిక, విద్యా విధానం, ట్యుటోరియల్ క్లాసుల వంటివి నిర్వహిస్తారు. ఇందుకోసం 100 మంది కెరీర్ గైడెన్స్ నిపుణులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. హైదరాబాద్ నుంచి 15 మంది ఉన్నారు. త్వరలో మరో 50 మందిని నియమించుకుంటాం. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాజీ సీఈఓ అండ్ ఎండీ ఆనంద్ సుదర్శన్, స్టాన్లీ బ్లాక్ అండ్ డెక్కర్ (ఇండియా) మాజీ ఎండీ సుబోధ్ జిందాల్, మెక్ఫీ మాజీ సీనియర్ డైరెక్టర్ తరుణ్ కృష్ణమూర్తి వంటి వారు లోడ్స్టార్లో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు.
260కి పైగా కెరీర్ ఆప్షన్స్.. ఫీజు రూ.4 వేలు
ప్రస్తుతం బెంగళూరు, మైసూరు, హైదరాబాద్ నగరాల్లో సేవలందిస్తున్నాం. విద్యార్థులకు 260కి పైగా కెరీర్ ఆప్షన్స్‌ను అందిస్తాం. ఒక్కో దాంట్లో 70కి పైగా పారామీటర్స్ ఉంటాయి. కెరీర్ అసెస్మెంట్ కోసం ఒక్కో విద్యార్థికి రూ.4 వేలు చార్జీ ఉంటుంది. కెరీర్ అసెస్మెంట్తో పాటూ 20 పేజీల సమగ్ర నివేదికనిస్తాం. దీంతో తల్లిదండ్రులకు తమ పిల్లాడు ఏ కోర్సును ఎంచుకుంటే ఏ కెరీర్లో స్థిరపడతాడో అవగాహన వస్తుంది. 2 వేల మంది విద్యార్థులు ఇప్పటివరకూ మా సేవలను వినియోగించుకున్నారు. ఈ ఏడాది ముగిసే నాటికి 8 వేల మంది విద్యార్థులకు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
రూ.26–30 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి
ప్రస్తుతానికి మా సంస్థలో 25 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు రెండు రౌండ్లలో కలిపి రూ.6 కోట్ల నిధులను సమీకరించాం. జైకెన్ ఫండ్, మణిపాల్ గ్రూప్‌కు చెందిన ఆనంద్ సుదర్శన్, పలువురు హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ముగింపు నాటికి చెన్నై, కోయంబత్తూరులకు విస్తరించటంతో పాటు రూ.3 కోట్ల ఆదాయా న్ని లకి‡్ష్యంచాం. విస్తరణకు రూ.26–30 కోట్ల నిధుల సమీకరణ చేస్తున్నాం. వీసీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ముగింపులోగా డీల్‌ను క్లోజ్ చేస్తాం.
మీకిష్టమైన ఉద్యోగం చేస్తారా?
Published Sat, Apr 29 2017 12:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆ..1,219 మంది ఉద్యోగులు మళ్లీ ఓటేయండి
నూతన పద్ధతిలో నగదు పంపిణీకి ప్రయత్నం
అధికారంలో ఉంటే అలా.. లేకుంటే ఇలా
దివ్యాంగుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉంది
ఇంగ్లిష్ మీడియం తెచ్చిన ఒకే ఒక్క సీఎం జగన్
ఎంత కుట్ర పన్నారన్నా..!
టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా
No Headline
ఇంటి నుంచే ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్
రాష్ట్రంలో మళ్లీ ఫ్యాన్ ప్రభంజనమే
తప్పక చదవండి
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement