బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌  

BSNLOffers 1year Amazon Prime Membership with Bharat Fiber plans - Sakshi

భార‌త్ ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్‌ క‌స్ట‌మ‌ర్ల‌కు  శుభవార్త

అమెజాన్‌  ప్రైమ్‌మెంబర్‌షిప్‌ ఏడాది ఉచితం

రూ.777 ఆ పైన ప్లాన్‌ను వాడుతున్న క‌స్ట‌మ‌ర్ల‌కే ఈ ఆఫ‌ర్ 

సాక్షి, న్యూఢిల్లీ : ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ త‌న కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. భార‌త్ ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్‌ క‌స్ట‌మ‌ర్ల‌కు నిజంగా శుభ‌వార్త చెప్పింది. ఈ సేవ‌లను వాడుతున్న వినియోగ‌దారుల‌కు ఏడాది అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తున్న‌ట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. దీని విలువ రూ.999. అయితే భార‌త్ ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్‌లో రూ.777 (18జీబీ) ఆపైన ప్లాన్‌ను వాడుతున్న క‌స్ట‌మ‌ర్ల‌కే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ ఆఫ‌ర్‌ను పొందాలంటే వినియోగ‌దారులు బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. 

అమెజాన్‌ ప్రైమ్‌ సేవల పట్ల భారతీయ ప్రేక్షకులు బాగా ఆకర్షితులవుతున్నారని అందుకే తమ వినియోగదారులు  ఆనందంకోసం వారెంతో ఎంతో ఇష్టపడేలా ఈ ప్లాన్‌ తీసుకొచ్చామని బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్, సీఈవో వివేక్ బంజల్ చెప్పారు. అలాగే డిసెంబర్‌లో అత్యంత సరసమైన ధరల వద్ద తీసుకొచ్చిన తమ  కొత్త డేటా ప్రణాళికలు నమ్మశక్యంకాని డిమాండ్‌ను తీసుకొచ్చాయన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top