ఆ బుక్‌ రేటు.. జస్ట్‌ రూ.20 లక్షలే!

Book Published Over Ferrari Car Models And Car History - Sakshi

చరిత్రే కదాని చీపుగా చూడకు..

చరిత్ర ఎంత కాస్ట్‌లీయో తెలియాలంటే.. ముందు ఫెరారీ గురించి తెలియాలి. ఫెరారీ.. ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్‌.. రేట్లు అదిరిపోతాయ్‌.. మనం కొనలేం.. అయితే.. కారే కాదు.. ఆ కారు గురించి రాసిన పుస్తకాన్ని కూడా కొనలేం. ఎందుకంటే.. ఈ మధ్య ఆ కార్ల చరిత్రను తెలియజేస్తూ ఓ పుస్తకాన్ని ముద్రించారు. దాని రేటెంతో తెలుసా? జస్ట్‌.. రూ.20 లక్షలే.. 514 పేజీలుండే ఆ పుస్తకాన్ని ఉంచిన స్టాండ్‌.. చూడ్డానికి ఫెరారీ 12 సిలెండర్ల ఇంజిన్‌లా ఉంటుంది. స్టీల్‌పై క్రోమియం పూత వేసి తయారుచేశారు. అల్యూమినియం పెట్టెలో ఉంచారు. ఇందులో ఫెరారీకి సంబంధించిన అరుదైన చిత్రాలు ఉన్నాయట. ఈ బుక్‌ స్టాండ్‌ను డిజైనర్‌ మార్క్‌ న్యూసన్‌ రూపొందించారు. 

మొత్తం 1,947 పుస్తకాలను ముద్రించారు. అందులో 250 పుస్తకాలను ఒక్కోటి రూ.20 లక్షల చొప్పున విక్రయిస్తారు. అదీ కూడా డబ్బున్న ప్రతి ఒక్కళ్లకూ అమ్మేయరు. మ్యూజియంలకు, ఫెరారీ కార్లను ఎక్కువగా కొనే వినియోగదారులకు అమ్ముతారు. మరి మిగిలిన 1,697 పుస్తకాల సంగతేంటనేగా మీ ప్రశ్న.. వీటిని అమ్మడానికి ఇలాంటి షరతులేవీ లేవు. ఎవరికైనా అమ్ముతారు. వాటి ధర రూ.4.1 లక్షలు.. అయితే.. ఆ డిజైనర్‌ స్టాండ్‌లాంటి అదనపు హంగులు ఉండవట. ఇంతకీ ఈ పుస్తకం పేరు చెప్పలేదు కదూ.. వేరేది పెడితే బాగుండదని.. ‘ఫెరారీ’అనే పెట్టేశారు.


 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top