బీఎండబ్ల్యూ కార్ల క్యూ... | BMW expands India portfolio with new 3 & 7-series models | Sakshi
Sakshi News home page

బీఎండబ్ల్యూ కార్ల క్యూ...

May 19 2017 12:23 AM | Updated on Sep 5 2017 11:27 AM

బీఎండబ్ల్యూ కార్ల క్యూ...

బీఎండబ్ల్యూ కార్ల క్యూ...

బీఎండబ్ల్యూ ఇండియా పలు కార్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. తన ‘7 సరీస్‌’లో ఒక కారును,

మూడు కొత్త మోడళ్లు
న్యూఢిల్లీ: బీఎండబ్ల్యూ ఇండియా పలు కార్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. తన ‘7 సరీస్‌’లో ఒక కారును, ‘3 సిరీస్‌’ల మరొక కారును, ఎక్స్‌1లో పెట్రోల్‌ వేరియంట్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత్‌లోని లగ్జరీ కార్ల మార్కెట్‌లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, పోర్ట్‌ఫోలియో విస్తరణకు తాజా మోడళ్లు దోహదపడతాయని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవహ్‌ తెలిపారు.

ఎం760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్‌
కంపెనీ తన ‘7 సిరీస్‌’కు మరొక కారును జత చేసింది. ‘ఎం760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్‌’ను మార్కెట్‌లోకి తెచ్చింది. దీని ధర రూ.2.27 కోట్లుగా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) ఉంది. ఇది స్టాండర్డ్, వి12 ఎక్సలెన్స్‌ అనే ఈ రెండు వేరియంట్ల రూపంలో పెట్రోల్‌ ఆప్షన్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది.

3 సిరీస్‌లో మరో కారు..
3 సిరీస్‌లో ‘330ఐ’ అనే సెడాన్‌ కారును  సంస్థ  ఆవిష్కరించింది. దీని ధర రూ.42.4 లక్షలు– రూ.44.9 లక్షల (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. ఇది ‘స్పోర్ట్‌ లైన్‌’, ‘ఎం స్పోర్ట్‌ ఎడిషన్‌’ అనే రెండు వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. పెట్రోల్‌ ఆప్షన్‌లలో లభ్యంకానున్న ఈ వేరియంట్లను కంపెనీ తన చెన్నై ప్లాంటులోనే తయారు చేస్తోంది.

ఎక్స్‌1లో పెట్రోల్‌ వెర్షన్‌
కంపెనీ తన ఎక్స్‌1 ఎస్‌యూవీలో పెట్రోల్‌ వేరియంట్‌ను కూడా మన మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.35.75 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ)గా ఉంది. ఇది ఎక్స్‌లైన్‌ ట్రిమ్‌ వెర్షన్‌లో కస్టమర్లకు లభ్యంకానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement