ఈ ఏడాది 13.5 శాతం వాటా లక్ష్యం

Blue Star to commission Sri City plant in AP by 2022 - Sakshi

బ్లూ స్టార్‌ జేఎండీ త్యాగరాజన్‌

హైదరాబాద్‌: భారత ఎయిర్‌ కండీషనర్ల మార్కెట్లో బ్లూ స్టార్‌కు ప్రస్తుతం 12.8 శాతం వాటా ఉంది. 2019–20లో 13.5 శాతం వాటాను లక్ష్యంగా చేసుకున్నామని కంపెనీ జేఎండీ బి.త్యాగరాజన్‌ మంగళవారం వెల్లడించారు. నూతన శ్రేణి ఏసీలను ఇక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

‘రూమ్‌ ఏసీల విక్రయాలు అన్ని బ్రాండ్లు కలిపి 2018–19లో 55 లక్షల యూనిట్లు నమోదు కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 10 శాతం వృద్ధి నమోదు చేయవచ్చు. ఇదే జరిగితే బ్లూ స్టార్‌ వృద్ధి రేటు 15 శాతం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో బ్లూ స్టార్‌ ప్లాంటు 2021–22లో సిద్ధం కానుంది. ఎక్స్‌క్లూజివ్‌ ఔట్‌లెట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 200 నుంచి 250కి చేర్చనున్నాం’ అని వివరించారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top