బిల్‌ గేట్స్‌కే ప్రేరణనిస్తున్న మహాదాత  ఎవరో తెలుసా?

Bill Gates Lauds Azim Premji for Philanthropy, says His Contribution will make a Tremendous Impact - Sakshi

సమాజ సేవకు, ముఖ్యంగా విద్యకు భారీగా నిధులను కేటాయించే విప్రో ఛైర్మన్‌, ఇండియన్‌ బిలియనీర్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ తన ఉదారతతో ప్రపంచ దాతలను సైతం ఆకర్షిస్తున్నారు. తాజాగా ప్రపంచ కుబేరుడు, మహాదాత, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ‍ఆయనపై ప్రశంసలు కురిపించారు. సమాజానికి ప్రేమ్‌జీ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమైనవని వ్యాఖ్యానించారు. సామాజిక వేదిక ట్విటర్‌ ద్వారా బిల్‌గేట్స్‌ తన అభిప్రాయాన్ని పోస్ట్‌ చేశారు.   

అజీమ్‌ ప్రేమ్‌జి తాజా వితరణ తనకు ఎంతో ఉత్సాహానిచ్చిందని పేర్కొన్నారు. ఇది అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. ముఖ్యంగా సమాజానికి ప్రేమ్‌జీ అందిస్తున్న స్వచ్ఛంద సహకారం, దాతృత్వం,  చూపిస్తున్న నిబద్ధత  ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాతలకు ప్రేరణనిస్తుందని బిల్‌ గేట్స్‌​ ట్వీట్‌ చేశారు.  
 
కాగా విప్రోలోనితన వాటాల్లో 34 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్‌కు కేటాయించినట్టు ఇటీవల అజీమ్‌ ప్రేమ్‌జీ ప్రకటించారు. రూ.52,700 కోట్లను అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు అందించారు. దీంతో  ప్రేమ్‌జీ  అందించిన  విరాళం విలువ మొత్తం రూ.1.45 లక్షల కోట్లకు (21 బిలియన్‌ డాలర్లు) చేరిన సంగతి తెలిసిందే. 

  చదవండి: సంచలనం : వేల కోట్ల రూపాయల విరాళం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top