‘బిగ్‌ బాస్కెట్‌’కు భారీ నష్టాలు | BigBasket Loss Widens To Rs 348 Crore In FY 2019 | Sakshi
Sakshi News home page

‘బిగ్‌ బాస్కెట్‌’కు భారీ నష్టాలు

Nov 30 2019 5:24 AM | Updated on Nov 30 2019 5:24 AM

 BigBasket Loss Widens To Rs 348 Crore In FY 2019 - Sakshi

న్యూఢిల్లీ: బిగ్‌ బాస్కెట్‌ సంస్థను నిర్వహించే ఇన్నోవేటివ్‌ రిటైల్‌ కాన్సెప్ట్స్ కంపెనీ నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో మరింతగా పెరిగాయి. 2017–18లో రూ.179 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.348 కోట్లకు పెరిగాయి. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.1,410 కోట్ల నుంచి 69 శాతం వృద్ధితో రూ.2,381 కోట్లకు పెరిగింది. ఇన్నోవేటివ్‌ రిటైల్‌ కాన్సెప్ట్స్ సంస్థ బిగ్‌ బాస్కెట్‌నే కాకుండా ‘సూపర్‌మార్కెట్‌ గ్రోసరీ సప్లైస్‌’ పేరుతో హోల్‌సేల్‌  విభాగాన్ని కూడా నిర్వహిస్తోంది.  ఆర్థిక ఫలితాల వివరాలను ఇన్నోవేటివ్‌ రిటైల్‌ కాన్సెప్ట్స్ సంస్థ కేంద్ర కంపెనీల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement