భారీగా పెరగనున్న బ్యాంకుల లెండింగ్‌ రేట్లు

Banks set to raise lending rates, pre-empting RBI - Sakshi

సాక్షి, ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు ప్రకటించకపోవడంతో  దేశంలోని ఇతర బ్యాంకులు  అధిక  లెండింగ్‌  రేట్లతో  వినియోగదారులకు షాక్‌ ఇవ్వనున్నాయా? తాజా పరిణామాలు ఈ అంచనాలకు బలం చేకూర్చుతున్నాయి.  ఇప్పటికే కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థ కొత్త సవాలు ఎదురు కానుందన్న  అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గృహ, వాహన రుణాలు మరింత ప్రియం కానున్నాయి.

తాజాగా భారత దేశంలో  రెండో అతిపెద్ద  ప్రయివేట్‌ బ్యాంక్  హెచ్‌డీఎఫ్‌సీ  బుధవారం తన లెండింగ్‌  రేట్లలో 10 బేసిస్ పాయింట్ల  పెంపును ప్రకటించింది. ఇదే బాటను ఇతర ప్రయివేటు బ్యాంకులు అనుసరించనున్నాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. జూలైనుండి బెంచ్మార్క్ 10-సంవత్సరాల దిగుబడి 100 బీపీఎస్‌ కంటే ఎక్కువ పెరగడం బ్యాంకులకి పెద్దగా ఆందోళన కలిగించే అంశమనీ  ఎనలిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా   పెరుగుతున్న ద్రవ్యోల్బణం బాండ్లకు దెబ్బతీసిందని,  ఇప్పటికే అనేక  సవాళ్లను ఎదుర్కొంటున్నబ్యాంకులకు ఇది మరో సవాల్‌ అని పేర్కొన్నారు. బాండ్‌ ఈల్డ్స్‌ భారీగా పెరగడంతో  లెండింగ్‌ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని ఎస్‌బీఐ ముఖ్య ఆర్థిక అధికారి సౌమ్య కాంతి ఘోష్‌ అభిప్రాయపడ్డారు.  ఇలాంటి పరిస్థితులలో బాండ్‌ ఈల్డ్స్‌ను పెరుదలను  చల్లబర్చేందుకు వడ్డీ రేట్లు  పెంపు  తప్పదన్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top