క్యూ3లో ఎఫ్‌ఐఐల భారీ పెట్టుబడులు | Bank of America hires Guenthardt from UBS for APAC banking-IFR | Sakshi
Sakshi News home page

క్యూ3లో ఎఫ్‌ఐఐల భారీ పెట్టుబడులు

Mar 6 2014 2:10 AM | Updated on Sep 2 2017 4:23 AM

క్యూ3లో ఎఫ్‌ఐఐల భారీ పెట్టుబడులు

క్యూ3లో ఎఫ్‌ఐఐల భారీ పెట్టుబడులు

ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ కాలం(క్యూ3)లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) దేశీ స్టాక్స్‌లో 600 కోట్ల డాలర్లను(రూ. 37,000 కోట్లకుపైగా) ఇన్వెస్ట్ చేశారు.

 న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్  కాలం(క్యూ3)లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) దేశీ స్టాక్స్‌లో 600 కోట్ల డాలర్లను(రూ. 37,000 కోట్లకుపైగా) ఇన్వెస్ట్ చేశారు. అంతక్రితం ఏడాది ఇదే కాలం(2012-13 క్యూ3)లో నమోదైన 70 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇవి దాదాపు 9 రెట్లు అధికమని బ్యాంక్ అమెరికా ఆఫ్ మెరిల్‌లించ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అయితే ఇదే కాలంలో ఎల్‌ఐసీసహా దేశీ మ్యూచువల్ ఫండ్స్ వంటి సంస్థలు నికర అమ్మకందారులుగా నిలవడం గమనార్హం.

 ఏప్రిల్‌లో జరగనున్న సాధారణ ఎన్నికలలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అంచనాలు ఇందుకు దోహదపడినట్లు తెలిపింది. కాగా, దేశీ మార్కెట్లలో వరుసగా ఐదో క్వార్టర్‌లో ఎఫ్‌ఐఐలు నికర పెట్టుబడిదారులుగా నిలిచినట్లు వెల్లడించింది. సాఫ్ట్‌వేర్ షేర్లలో ఎఫ్‌ఐఐలు అత్యధికంగా ఇన్వెస్ట్‌చేయగా, టెక్ మహీంద్రాలో 45.1 కోట్ల డాలర్లను, ఇన్ఫోసిస్‌లో 37.2 కోట్ల డాలర్లను, హెచ్‌సీఎల్ టెక్‌లో 25.7 కోట్ల డాలర్లను, విప్రో షేర్లలో 24.6 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసినట్లు నివేదిక వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement