బజాజ్‌ ఆటో కొత్త బైక్‌ : రూ.38 వేలు  | Bajaj Auto launches new CT110 bike price starting at Rs 37997  | Sakshi
Sakshi News home page

బజాజ్‌ ఆటో కొత్త బైక్‌ : రూ.38 వేలు 

Jul 22 2019 2:10 PM | Updated on Jul 23 2019 7:58 AM

Bajaj Auto launches new CT110 bike price starting at Rs 37997  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  బజాజ్ ఆటో ఎంట్రీ లెవల్ మోటారుసైకిల్‌ను లాంచ్‌ చేసింది. సీటీ 110 లోని సరికొత్త వెర్షన్‌ను సోమవారం తీసుకొచ్చింది. రూ .37,997, రూ .44,480 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ధరల పరిధిలో విడుదల చేసింది. కొత్త సిటి 110 హై గ్రౌండ్ క్లియరెన్స్,  స్ట్రాంగ​ అండ్‌ బిగ్గర్‌ క్రాష్ గార్డ్స్‌తో కఠినమైన రహదారుల్లో కూడా మంచి ప్రదర్శన కనబరుస్తుందని బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపింది. మూడు రంగుల్లో లాంచ్‌ అయిన ఈ  బైక్‌ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. 115 సిసి ఇంజిన్‌తో,  8.6 పిఎస్ శక్తిని అందిస్తుంది. 

కిక్ స్టార్ట్ వెర్షన్ ధర  రూ. 37,997 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) 
ఎలక్ట్రిక్ స్టార్ట్ ఆప్షన్ రూ .44,480 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) 

బడ్జెట్‌ ధరలో బెస్ట్‌ బైక్‌ను అందిచండమే తమ లక్ష్యమని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సారంగ్ కనడే వెల్లడించారు. ఎక్కువ మైలేజీ, పవర్ తోపాటు ఆకర్షణీయ ధరలో తీసుకొచ్చిన తమ కొత్త సీటీ 110 వెర్షన్‌ అత్యుత్తమ పనితీరుతో  వినియోగదారులను ఆకట్టుకుంటుందన్న దీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు (సీటీ  శ్రేణి) 50 లక్షల వాహనాలను విక్రయించినట్టు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement