గతేడాది కంటే మెరుగైన వృద్ధి 

Bajaj Allianz Life hopes to grow at 29% in new premium in FY19 - Sakshi

బజాజ్‌ అలియంజ్‌ లైఫ్‌ ధీమా 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బీమా రంగంలో ఉన్న బజాజ్‌ అలియంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం రూ.4,291 కోట్ల నూతన ప్రీమియం సాధించింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 29 శాతం వృద్ధి. పరిశ్రమ వృద్ధి రేటు కేవలం 11 శాతం మాత్రమే. 2018–19లో గతేడాది కంటే మెరుగ్గా పనితీరు కనబరుస్తామని బజాజ్‌ అలియంజ్‌ లైఫ్‌ అపాయింటెడ్‌ యాక్చువరీ సాయి శ్రీనివాస్‌ ధూళిపాళ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. రెండు కొత్త ఉత్పాదనలను ఐఆర్‌డీఏ క్లియరెన్స్‌ రాగానే అందుబాటులోకి తెస్తామన్నారు.

ఇప్పటికే 40కిపైగా ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు చెప్పారు. ‘2017–18లో మొత్తం రూ.7,578 కోట్ల వ్యాపారం చేశాం. 3.08 లక్షల పాలసీలను విక్రయించాం. కంపెనీ మార్కెట్‌ వాటా 1.9 నుంచి 2.2 శాతానికి చేరింది. క్లైముల శాతం గ్రూప్‌ విభాగంలో 99.6, ఇండివిడ్యువల్‌ విభాగంలో 92.3 శాతముంది. వ్యాపారం పరంగా హైదరాబాద్‌లో టాప్‌–3లో ఉన్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.211 కోట్ల నూతన ప్రీమియం అందుకున్నాం’ అన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top