5జీపై టెలికం శాఖతో చర్చల్లో క్వాల్‌కామ్‌

AT&T announces a better 5G Samsung phone - Sakshi

హవాయ్‌:   భారత్‌లో 5జీ టెలికం సర్వీసుల విస్తృతికి అపార అవకాశాలు ఉన్నాయని మొబైల్‌ చిప్‌ తయారీ సంస్థ క్వాల్‌కామ్‌ టెక్నాలజీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దుర్గా మల్లాది తెలిపారు. 5జీతో అవకాశాలపై దేశీయంగా మరింత అవగాహన కల్పించేందుకు తీసుకోతగిన చర్యలపై టెలికం శాఖతో పాటు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌తో కూడా చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. 5జీ సర్వీసులు వచ్చినంత మాత్రాన 4జీ ఎల్‌టీఈ సేవలు పూర్తిగా నిల్చిపోవని ఆమె పేర్కొన్నారు.  5జీ సేవలు ఎప్పటికల్లా అందుబాటులోకి వస్తాయన్న అంచనాలు వెల్లడించేందుకు నిరాకరించారు. స్నాప్‌డ్రాగన్‌ టెక్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. ఈ సదస్సులో భాగంగా లేటెస్ట్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 చిప్‌ను క్వాల్‌కామ్‌ ఆవిష్కరించింది. శాంసంగ్‌ తదితర హ్యాండ్‌సెట్స్‌ తయారీ సంస్థలు వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెట్టే 5జీ ఫోన్స్‌లో వీటిని వినియోగించనున్నాయి. 

ఇన్‌ఫ్లయిట్‌ కనెక్టివిటీపై త్వరలో మార్గదర్శకాలు 
విమానప్రయాణంలో కూడా ఫోన్‌ కాల్స్, ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించే ఇన్‌–ఫ్లయిట్‌ కనెక్టివిటీపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేంద్ర టెలికం శాఖ మంత్రి మనో జ్‌ సిన్హా చెప్పారు. న్యాయ శాఖ అనుమతులు లభిస్తే జనవరిలోనే నిబంధనలను వెల్లడిస్తామన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top