Appకీ కహానీ... | app ka khani | Sakshi
Sakshi News home page

Appకీ కహానీ...

Dec 25 2017 1:48 AM | Updated on Dec 25 2017 8:22 AM

app ka khani - Sakshi

ఆర్‌టీఏ ఎం–వాలెట్‌
ఆర్‌టీఏ ఎం–వాలెట్‌’ యాప్‌. దీన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జారీ చేసే ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి డాక్యుమెంట్లను ఈ యాప్‌లో డిజిటల్‌ రూపంలో దాచుకోవచ్చు. పోలీసులు వాహనాన్ని ఆపినప్పుడు యాప్‌ ఓపెన్‌ చేసి డాక్యుమెంట్లు చూపిస్తే సరిపోతుంది. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకసారి డౌన్‌లోడ్‌ చేసుకుంటే... ఫోన్లో ఇంటర్నెట్‌ లేకున్నా డాక్యుమెంట్లు స్టోర్‌ అయి ఉంటాయి పోలీసులు అడిగినపుడు చూపించొచ్చు.

ప్రత్యేకతలు
ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి డాక్యుమెంట్లను స్టోర్‌ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్‌ నెంబర్‌తోపాటు చాసిస్‌ నెంబర్‌లోని చివరి ఐదు సంఖ్యలను ఎంటర్‌ చేస్తే మన ఆర్‌సీ వస్తుంది.
♦  డ్రైవింగ్‌ లైసెన్స్‌ నెంబర్, పుట్టిన తేదీ, ఆర్‌టీఏ కార్యాలయం వివరాలు ఎంటర్‌ చేస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ కనిపిస్తుంది.
అయితే ఈ యాప్‌ తెలంగాణలో మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ రిజిస్టర్‌ అయిన వాహనాల సమాచారమే వస్తుంది. ఇక్కడి ఆర్‌టీఏ కార్యాలయాల్లో పొందిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ వివరాలు మాత్రమే కనిపిస్తాయి. దేశంలో మీరు ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ కనక డ్రైవింగ్‌ చేస్తుంటే  పోలీసులు ఆపొచ్చు. ఈ డిజిటల్‌ యాప్‌ చూపిస్తే చెల్లదని అనొచ్చు. కాబట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు లైసెన్స్, ఆర్‌సీలను భౌతిక రూపంలో క్యారీ చెయ్యటమే బెటర్‌.  

Advertisement
 
Advertisement
Advertisement