వాజ్‌పేయి మరణం: ఆనంద్‌ మహీంద్ర సంతాపం | Anand Mahindra express grief about Vajpayee death | Sakshi
Sakshi News home page

వాజ్‌పేయి మరణం: ఆనంద్‌ మహీంద్ర సంతాపం

Aug 16 2018 6:33 PM | Updated on Aug 16 2018 6:43 PM

Anand Mahindra  express grief  about Vajpayee death - Sakshi

సాక్షి, ముంబై: మహోన్నత నేత, బీజేపీ కురువృద్ధుడు, భారత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ  వాజ్‌పేయి అస్తమయంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర  తీవ్ర సంతాపం ప్రకటించారు.  ఆయన మృతిపై విచారం వ్యక్తం  చేస్తూ ట్విటర్‌లో ఒక ఫోటోను షేర్‌ చేశారు. ఆయన ఆఖరి పుట్టిన రోజు సందర్భంగా ఈ విలువైన  ఫోటోను ట్వీట్‌ చేశానంటూ గుర్తు  చేసుకున్నారు.

కాగా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) గురువారం సాయంత్రం కన్నుమూసారని అధికారికంగా ప్రకటించారు. దీంతో బీజేపీ శ్రేణులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు వాజ్‌పేయి మృతిపై దేశ, విదేశాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు,ఇతర ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు.  అటు మాజీ ప్రధాని మరణంపై  సంతాపాన్ని ప్రకటించేందుకు కేంద్ర కేబినెట్‌ అత్యవసరంగా సమావేశం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement