ఐసీఐసీఐపై ఫిచ్‌ కీలక వ్యాఖ్యలు

Allegations against ICICI Bank pose reputational risk: Fitch - Sakshi

బ్యాంకు ప్రతిష్టకు భంగమే-ఫిచ్‌

అయిదోరోజు కూడా రాజీవ్‌ విచారణ

డ్యామేజ్‌ కంట్రోల్‌ పనిలో బోర్డు

సాక్షి, ముంబై: వీడియోకాన్‌ గ్రూపు రుణ వివాదంతో  ఇబ్బందుల్లో పడ్డ ఐసీఐసీఐ బ్యాంకు ప్రాభవం మరింత మసకబారుతోంది. తాజాగా క్రెడిట్‌ రేటింగ్‌  ఏజెన్సీ ఫిచ్‌ రేటింగ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది.  బ్యాంకుపై   ఆరోపణలు  సంస్థ  రిపుటేషన్‌ను దెబ్బతీస్తుందని పేర్కొంది.   సీబీఐ విచారణ పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతిందని తెలిపింది.  అంతేకాదు ఐసీఐసీఐలో  గవర్నెన్స్‌పై ప్రశ్నలు తలెత్తాయని ఫిచ్ రేటింగ్స్ సోమవారం వ్యాఖ్యానించింది. బ్యాంకుపై ఆరోపణలను దర్యాప్తు సంస్థ రుజువు  అయితే..భారీ ఆర్థిక జరిమానా ప్రమాదంతోపాటు చట్టపరమైన చర్యలు కూడా  తీవ్రంగానే ఉండనున్నాయని ఫిచ్‌ అంచనా వేసింది.

వీడియోకాన్‌ గ్రూపునకు సంబంధించిన రుణ కేటాయింపు వివాదాన్ని పరిశీలిస్తున్నామని..దీనికనుగుణంగా తదుపరి రేటింగ్‌ను అంచనా వేస్తామని ఒక  ప్రకటనలో వెల్లడించింది.  బ్యాంకు కీర్తి , ఆర్థిక ప్రొఫైల్‌కు నష్టాలు గణనీయంగా పెరగడం లాంటి ఇతర పరిణమాల నేపథ్యంలో  తగిన రేటింగ్ తీసుకుంటామని  తెలిపింది. అలాగే స్వతంత్ర దర్యాప్తునకు బ్యాంకు అయిష్టతను ప్రకటించడం  కార్పొరేట్ పాలనా పద్ధతిపై బలమైన  సందేహాలను కలగిస్తోందని ఫిచ్‌ అభిప్రాయపడింది.అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులతో  పోలీస్తే ఐసీఐసీఐలాంటి ప్రయివేటురంగ దిగ్గజ బ్యాంకుల్లో కార్పొరేట్‌ గవర్నెర్స్‌ పటిష్టంగా ఉంటుందనేది తమ  విశ్వాసంగా ప్రకటించింది. మెరుగైన-అర్హత కలిగిన బోర్డు సభ్యులు,  వృత్తిపరమైన  నైపుణ్య నిర్వహణ  అంశాల కారణంగా కార్పొరేట్‌ గవర్నెన్స్‌ మెరుగ్గా వుంటుందని పేర్కొంది.

మరోవైపు ఐసీఐసీఐ బ్యాంకు  బోర్డు  డ్యామేజ్‌ కంట్రోల్‌లో పడింది.  టాప్‌  పెట్టుబడిదారులతో కీలక సమావేశాన్ని  ఏర్పాటు చేసింది.  ఈ సమావేశంలో   ఇన్వెస్టర్లు మరిన్నివివరాలు కావాలంటూ డిమాండ్‌  చేశారు. అటు బ్యాంకు సీఈవో చందా కొచర్‌ భర్త  దీపక్‌  సోదరుడు రాజీవ్‌ కొచర్‌ను వరుసగా అయిదవ రోజు కూడా సీబీఐ విచారిస్తోంది.  అటు ఐసీఐసీఐలో  12.3 శాతం అధిక వాటా కలిగి వున్న  ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ కూడా  ఈ సంక్షోభంపై  ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top