
న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ సమాఖ్య ‘సియామ్’ తాజాగా 2047 నాటికి దేశంలో విక్రయమయ్యే వెహికల్స్ అన్ని ఎలక్ట్రిక్ వాహనాలే అయ్యిండాలని పేర్కొంది. నగరాల్లోని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు ఈ గడువును 2030గా నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 2030 నాటికి దేశంలో విక్రయమ్యే కొత్త వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 40 శాతంగా ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కాగా 2030 నాటికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలను, పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో 40 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
నిర్దేశిత లక్ష్యాల సాకారం కోసం పరిశ్రమ, ప్రభుత్వం, కంపెనీలు సంయుక్తంగా ముందుకెళ్లాలని సియామ్ ప్రెసిడెంట్ అభయ్ ఫిరొడియా అభిప్రాయపడ్డారు. దేశంలో వందో స్వాతంత్ర వేడుకల నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడానికి సియమ్ రోడ్‌మ్యాప్ రూపొందించింది.