ఫీచర్‌ ఫోన్‌ ధరలో ఎయిర్‌టెల్‌ స్మార్ట్‌ఫోన్లు

Airtel Offers Karbonn A1 Indian, A41 Power Smartphones Starting At Rs. 1,799 - Sakshi

ఎయిర్‌టెల్‌ గురువారం మరో రెండు కొత్త ఆండ్రాయిడ్‌ ఆధారిత 4జీ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. హ్యాండ్‌సెట్‌ తయారీదారి కార్బన్‌ మొబైల్స్‌ భాగస్వామ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. ''ఏ1 ఇండియన్‌‌'', ''ఏ41 పవర్‌'' పేర్లతో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను ఫీచర్‌ ఫోన్‌ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏ1 ఇండియన్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,799కు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట చిల్లర ధర 4,390 రూపాయలు. అదేవిధంగా ఏ41 పవర్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను 1,849 రూపాయలకు విక్రయానికి తెస్తోంది. దీని చిల్లర గరిష్ట ధర కూడా 4,290 రూపాయలు. జియో ఫీచర్‌ ఫోన్‌కు గట్టి పోటీగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను రెండు వేల రూపాయల తక్కువకు మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. 

''మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌'' కార్యక్రమంలో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేస్తున్నట్టు భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ప్రతి భారతీయుడు 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసి, డిజిటల్‌ సూపర్‌హైవేలో పాలు పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు పేర్కొంది. ఎయిర్‌టెల్‌-కార్బన్‌ భాగస్వామ్యం కింద అందుబాటులోకి వచ్చే అన్ని డివైజ్‌లు అమెజాన్‌ ఇండియాలో కూడా లభ్యంకానున్నాయి. ''మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్'' కింద తాము తీసుకొచ్చిన తొలి ఆఫర్‌కు మంచి డిమాండ్‌ ఉందని భారతీ ఎయిర్‌టెల్‌ సీఎంఓ డైరెక్టర్‌-కన్జ్యూమర్‌ బిజినెస్‌ రాజ్‌ పుడిపెడ్డి తెలిపారు. నేడు లాంచ్‌ చేసిన రెండు డివైజ్‌ల ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

ఏ1 ఇండియన్‌ ఫీచర్లు
4 అంగుళాల డిస్‌ప్లే
1.1గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌
1జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
32జీబీ వరకు విస్తరణ మెమరీ
డ్యూయల్‌ సిమ్‌
ఆండ్రాయిడ్‌ 7.0 నోగట్‌
1500ఎంఏహెచ్‌ బ్యాటరీ
3.2 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
2 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా

ఏ41 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు
4 అంగుళాల డిస్‌ప్లే
1.3గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌
1జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
32జీబీ వరకు విస్తరణ మెమరీ
డ్యూయల్‌ సిమ్‌
ఆండ్రాయిడ్‌ 7.0 నోగట్‌
2,300ఎంఏహెచ్‌ బ్యాటరీ
2 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
0.3 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top